వడోదరా: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత మహిళలతో జరుగుతున్న రెండో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 288 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా మహిళల్లో నికోల్ బోల్టన్(84;88 బంతుల్లో 12 ఫోర్లు), ఎలైస్ పెర్రీ(70;70 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లు), బెత్ మూనీ(56; 40 బంతుల్లో 9 ఫోర్లు) హాఫ్ సెంచరీలు సాధించి జట్టు భారీ స్కోరు చేయడంలో సహకరించారు.
ఆస్ట్రేలియా 54 పరుగుల వద్ద అలైసా హేలీ(19) వికెట్‌ను కోల్పోగా, లాన్నింగ్-బోల్టన్ జోడి స్కోరును చక్కదిద్దింది. ఈ జోడి 76 పరుగులు జోడించిన తర్వాత లాన్నింగ్(24) రెండో వికెట్‌గా పెవిలియన్‌కు చేరారు. ఆపై రాచెల్ హేన్స్ డకౌట్‌గా అవుట్ కావడంతో ఆసీస్ తడబడినట్లు కనబడింది. కాగా, మూనీ బాధ్యతాయుతంగా ఆడటంతో ఆసీస్ గాడిలో పడింది. ఈ క్రమంలోనే మూనీ అర్థ శతకం సాధించారు. ఇక చివర్లో నికోలా కారే(16;11 బంతుల్లో 3 ఫోర్లు) బ్యాట్ ఝుళిపించడంతో ఆసీస్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 287 పరుగులు చేసింది. భారత బౌలర్లలో శిఖా పాండే మూడు వికెట్లు సాధించగా, పూనమ్ యాదవ్ రెండు వికెట్లు తీశారు. ఏక్తా బిస్త్, హర్మన్ ప్రీత్ కౌర్‌లకు తలో వికెట్ వికెట్ దక్కింది. తొలి వన్డేలో ఆసీస్ మహిళలు విజయం సాధించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment