ముంబై: ఇటీవల ఆసీస్ మహిళలతో జరిగిన వన్డే సిరీస్‌లో వైట్‌వాష్ అయిన భారత మహిళలకు మరో షాక్ తగిలింది. ముక్కోణపు టీ 20 సిరీస్‌లో భాగంగా ఇక్కడ బార్బోర్న్ స్టేడియంలో ఆస్ట్రేలియా మహిళలతో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత మహిళలు ఆరు వికెట్ల తేడాతో పరాజయం చెందారు. భారత మహిళలు నిర్దేశించిన 153 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ 18.1 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది.
ఆసీస్ మహిళల్లో బెత్ మూనీ(45; 32 బంతుల్లో 8 ఫోర్లు), ఎలైస్ విలానీ(39), మెగ్ లాన్నింగ్(35 నాటౌట్)లు రాణించి జట్టుకు విజయాన్ని అందించారు. అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత మహిళలు నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 152 పరుగులు చేశారు. స్మృతీ మంధాన(67), అనుజా పటిల్(35)లు మాత్రమే మెరవగా, మిథాలీ రాజ్(18), వేదా కృష్ణమూర్తి(15), హర్మన్ ప్రీత్ కౌర్(13)లు నిరాశపరిచారు.
Comments
Please login to add a commentAdd a comment