
సాక్షి, హైదరాబాద్: జాతీయ అండర్–9 చెస్ చాంపియన్‌షిప్ ఓపెన్ విభాగంలో తెలంగాణ ప్లేయర్‌కు కాంస్య పతకం లభించింది. హరియాణా చెస్ సంఘం ఆధ్వర్యంలో గురుగ్రామ్‌లో శుక్రవారం ముగిసిన ఈ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ ఆటగాడు విశ్వక్ సేన్ తొమ్మిది పాయింట్లతో మూడో స్థానంలో నిలిచాడు. తెలంగాణకే చెందిన ఆదిరెడ్డి అర్జున్ కూడా తొమ్మిది పాయింట్లు సాధించగా... మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా విశ్వక్ సేన్‌కు కాంస్య పతకం ఖాయమైంది.
అర్జున్‌కు నాలుగో స్థానం లభించింది. నిర్ణీత 11 రౌండ్లపాటు జరిగిన ఈ చాంపియన్‌షిప్‌లో విశ్వక్ సేన్ ఎనిమిది గేముల్లో గెలిచి, రెండింటిని ‘డ్రా’ చేసుకొని, మరో గేమ్‌లో ఓడిపోయాడు. ఓం మనీశ్ కదమ్ (9.5 పాయింట్లు–మహారాష్ట్ర), అక్కరకమ్ జాన్ వేని (9.5 పాయింట్లు–కేరళ) సంయుక్తంగా అగ్రస్థానంలో నిలువగా... మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా మనీశ్‌కు స్వర్ణం, జాన్‌కు రజతం లభించాయి.
Comments
Please login to add a commentAdd a comment