ముంబై : ప్రస్తుత యువ క్రికెటర్లలో చాలా మందికి టీమిండియా దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కరే స్ఫూర్తి. అతడి ఆటను ఆదర్శంగా తీసుకుని క్రికెట్‌వైపు అడుగులు వేసిన వారూ ఎందరో ఉన్నారు. అయితే ఏకంగా సచినే ఓ క్రికెటర్ ఆటను మెచ్చుకుంటే ఇంకేంటి ఎగిరి గంతేసుడే. ప్రస్తుతం టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రిత్ బుమ్రా చేస్తుంది అదే. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ అనంతరం సచిన్ మాట్లాడుతూ ప్రస్తుతం బుమ్రా ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్ అంటూ కితాబిచ్చిన విషయం తెలిసిందే. దీనిపై ట్విటర్ వేదికగా స్పందించిన బుమ్రా‘నాకు మాటలు రావడంలేదు.. థ్యాంక్యూ సచిన్ సర్’అంటూ ట్వీట్ చేశాడు.
చెన్నై సూపర్‌కింగ్స్‌తో జరిగిన ఫైనల్ పోరులో చివరి బంతికి శార్దూల్ ఠాకూర్‌ను ఔట్ చేసి ముంబైకి విజయం అదించింది మలింగ అయితే.. ఓడిపోయే మ్యాచ్‌ను అక్కడి వరకు తీసుకవచ్చింది మాత్రం బుమ్రానే. ఫైనల్ మ్యాచ్‌లో బుమ్రా(2/14) కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి కీలక సమయాలలో రాయుడు, బ్రేవో వికెట్లను పడగొట్టాడు. అయితై ఫైనల్ మ్యాచ్ అనంతరం సచిన్‌ను యువరాజ్ సింగ్ ఇంటర్వ్యూ చేశాడు. ఈ సందర్భంగా బుమ్రా ఇప్పటికే ప్రపంచ ఆగ్రశ్రేణి బౌలర్ అయ్యాడని.. అతడిలో ఇంకా అత్యుత్తమ ప్రదర్శన దాగి ఉందని పేర్కొన్నాడు. కాగా ఈ సీజన్ మొత్తంలో బుమ్రా 16 మ్యాచుల్లో 19 వికెట్లు తీసి 6.63 ఎకానమీ సాధించాడు.
సంబంధిత వీడియో కోసం క్లిక్ చేయండి :
బుమ్రా ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్
Comments
Please login to add a commentAdd a comment