
జస్‌ప్రీత్ బుమ్రా
ఇంగ్లండ్‌తో మంగళవారం నుంచి ప్రారంభంకానున్న మూడు టి20 మ్యాచ్‌ల సిరీస్‌కు భారత పేస్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా దూరమయ్యాడు. ఐర్లాండ్‌తో తొలి టి20 సందర్భంగా ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో అతని ఎడమ వేలికి గాయమైంది. గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో బుమ్రాకు విశ్రాంతి కల్పించారు. జూలై 12 నుంచి ప్రారంభమయ్యే వన్డే సిరీస్‌కు అతను అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. బుమ్రాతో పాటు యువ ఆఫ్ స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ కూడా గాయం కారణంగా ఈ సిరీస్ నుంచి వైదొలిగాడు.
Comments
Please login to add a commentAdd a comment