పివి సింధు, సైనా నెహ్వాల్
న్యూఢిల్లీ: ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) తాజా ర్యాంకింగ్స్‌ను మంగళవారం ప్రకటించింది. ఈ ర్యాంకింగ్స్‌లో భారత స్టార్ క్రీడాకారిణి పీవీ సింధు 5వ స్థానాన్ని కైవసం చేసుకోగా, సైనా నెహ్వాల్ 8వ ర్యాంక్‌లో కొనసాగుతున్నారు. వీరిద్దరూ గత స్థానాలను పదిలంగా ఉంచుకున్నారు. మహిళల సింగిల్స్‌లో ముగ్ధ అగ్రే, రితుపర్న దాస్ వారి స్థానాలను మెరుగుపరుచుకుని 62, 65వ స్థానాలకు ఎగబాకారు. మహిళల డబుల్స్‌లో అశ్విని పొన్నప్ప-సిక్కి రెడ్డి రెండు స్థానాలు దిగజారి 24 ర్యాంక్‌కు పడిపోయారు. మిక్స్‌డ్ డబుల్స్‌లో ప్రనవ్ జెర్రీ చోప్రా- సిక్కి రెడ్డి 22వ స్థానంలో, పొన్నప్ప- రాంకిరెడ్డి జోడీ 23వ స్థానంలో స్థిరపడ్డారు.
కాగా పురుషుల సింగిల్స్‌లో కిదాంబి శ్రీకాంత్, సమీర్ వర్మలు 10, 13 స్థానాల్లో కొనసాగుతున్నారు. జపాన్ ఓపెన్ సెమీఫైనల్స్‌లో కెంటో మొమొటా చేతిలో ఓడిపోయిన సాయి ప్రణీత్ నాలుగు స్థానాలు ఎగబాకి పురుషుల సింగిల్స్‌లో 20వ స్థానానికి చేరుకున్నాడు. హెచ్‌ఎస్ ప్రణయ్(31), పారుపల్లి కశ్యప్(35), శుభంకర్‌దే(41), సౌరభ్, వర్మ(44) వరుసగా తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు. పురుషుల సింగిల్స్‌లో అజయ్ జయరామ్ 67వ స్థానంలో ఉండగా లక్షయ్ సెన్ 69వ స్థానంలో ఉన్నాడు. పురుషుల డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్ రాంకిరెడ్డి, చిరాగ్ శెట్టి రెండు స్థానాలు ఎగబాకి 16వ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. మను అత్రి-సుమిత్ రెడ్డిలు 25వ స్థానంలో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment