BWF ranking
-
టాప్ టెన్‌లో సింధు, సైనా
న్యూఢిల్లీ: ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) తాజా ర్యాంకింగ్స్‌ను మంగళవారం ప్రకటించింది. ఈ ర్యాంకింగ్స్‌లో భారత స్టార్ క్రీడాకారిణి పీవీ సింధు 5వ స్థానాన్ని కైవసం చేసుకోగా, సైనా నెహ్వాల్ 8వ ర్యాంక్‌లో కొనసాగుతున్నారు. వీరిద్దరూ గత స్థానాలను పదిలంగా ఉంచుకున్నారు. మహిళల సింగిల్స్‌లో ముగ్ధ అగ్రే, రితుపర్న దాస్ వారి స్థానాలను మెరుగుపరుచుకుని 62, 65వ స్థానాలకు ఎగబాకారు. మహిళల డబుల్స్‌లో అశ్విని పొన్నప్ప-సిక్కి రెడ్డి రెండు స్థానాలు దిగజారి 24 ర్యాంక్‌కు పడిపోయారు. మిక్స్డ్ డబుల్స్‌లో ప్రనవ్ జెర్రీ చోప్రా- సిక్కి రెడ్డి 22వ స్థానంలో, పొన్నప్ప- రాంకిరెడ్డి జోడీ 23వ స్థానంలో స్థిరపడ్డారు. కాగా పురుషుల సింగిల్స్‌లో కిదాంబి శ్రీకాంత్, సమీర్ వర్మలు 10, 13 స్థానాల్లో కొనసాగుతున్నారు. జపాన్ ఓపెన్ సెమీఫైనల్స్‌లో కెంటో మొమొటా చేతిలో ఓడిపోయిన సాయి ప్రణీత్ నాలుగు స్థానాలు ఎగబాకి పురుషుల సింగిల్స్‌లో 20వ స్థానానికి చేరుకున్నాడు. హెచ్ఎస్ ప్రణయ్(31), పారుపల్లి కశ్యప్(35), శుభంకర్‌దే(41), సౌరభ్, వర్మ(44) వరుసగా తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు. పురుషుల సింగిల్స్‌లో అజయ్ జయరామ్ 67వ స్థానంలో ఉండగా లక్షయ్ సెన్ 69వ స్థానంలో ఉన్నాడు. పురుషుల డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్ రాంకిరెడ్డి, చిరాగ్ శెట్టి రెండు స్థానాలు ఎగబాకి 16వ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. మను అత్రి-సుమిత్ రెడ్డిలు 25వ స్థానంలో ఉన్నారు. -
'టాప్ టెన్' లో కశ్యప్
న్యూఢిల్లీ: ఇండోనేసియా సూపర్ సిరీస్ లో సత్తా చాటిన భారత బ్యాడ్మింటన్ క్రీడాకారుడు పారుపల్లి కశ్యప్ మరోసారి 'టాప్ టెన్' లోకి దూసుకొచ్చాడు. బీడబ్ల్యూ ఎఫ్ తాజాగా ప్రకటించిన పురుషుల సింగిల్స్ ప్రపంచ ర్యాంకింగ్స్ లో రెండు స్థానాలు ఎగబాకి 10వ ర్యాంకులో నిలిచాడు. మరో ఇండియన్ ప్లేయర్ కిదాంబి శ్రీకాంత్ భారత్ తరపున అత్యుత్తమ ర్యాంకులో ఉన్నాడు. అతడు మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. మహిళల సింగిల్స్ లో సైనా నెహ్వాల్ రెండో ర్యాంకు దక్కించుకుంది. పీవీ సింధు 14వ ర్యాంకులో కొనసాగుతోంది. -
సైనా ర్యాంక్ మళ్లీ పతనం
ఈ ఏడాది స్థాయికి తగ్గట్టు రాణించలేకపోతున్న భారత ఏస్ షట్లర్ సైనా నెహ్వాల్ ర్యాంక్ పతనం కొనసాగుతోంది. గత వారమే ఆరో ర్యాంక్‌కు పడిపోయిన హైదరాబాదీ తాజాగా మరో స్థానం కోల్పోయింది. ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ సిరీస్‌లో రెండో రౌండ్లోనే వెనుదిరిగిన సైనా.. గురువారం విడుదల చేసిన తాజా జాబితాలో ఓ స్థానం కోల్పోయి ఏడో ర్యాంక్‌తో సరిపెట్టుకుంది. ఈ ఏడాది వరుస వైఫల్యాలు, గాయాలతో సతమతమవుతున్న సైనా.. ఒక్క టైటిల్ కూడా గెలవలేకపోయింది. కాగా యువ సంచలనం పీవీ సింధు మరో స్థానం ఎగబాకి మళ్లీ పదోస్థానం సాధించింది. పురుషుల సింగిల్స్‌లో పారుపల్లి కశ్యప్ ఓ స్థానం కోల్పోయి 12వ స్థానానికి దిగజారాడు. యువ షట్లర్లు గురుసాయి దత్, శ్రీకాంత్, సాయి ప్రణీత్ ర్యాంక్‌లు మెరుగయ్యాయి.