సైనా ర్యాంక్ మళ్లీ పతనం
ఈ ఏడాది స్థాయికి తగ్గట్టు రాణించలేకపోతున్న భారత ఏస్ షట్లర్ సైనా నెహ్వాల్ ర్యాంక్ పతనం కొనసాగుతోంది. గత వారమే ఆరో ర్యాంక్కు పడిపోయిన హైదరాబాదీ తాజాగా మరో స్థానం కోల్పోయింది. ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ సిరీస్లో రెండో రౌండ్లోనే వెనుదిరిగిన సైనా.. గురువారం విడుదల చేసిన తాజా జాబితాలో ఓ స్థానం కోల్పోయి ఏడో ర్యాంక్తో సరిపెట్టుకుంది.
ఈ ఏడాది వరుస వైఫల్యాలు, గాయాలతో సతమతమవుతున్న సైనా.. ఒక్క టైటిల్ కూడా గెలవలేకపోయింది. కాగా యువ సంచలనం పీవీ సింధు మరో స్థానం ఎగబాకి మళ్లీ పదోస్థానం సాధించింది. పురుషుల సింగిల్స్లో పారుపల్లి కశ్యప్ ఓ స్థానం కోల్పోయి 12వ స్థానానికి దిగజారాడు. యువ షట్లర్లు గురుసాయి దత్, శ్రీకాంత్, సాయి ప్రణీత్ ర్యాంక్లు మెరుగయ్యాయి.