'టాప్ టెన్' లో కశ్యప్
న్యూఢిల్లీ: ఇండోనేసియా సూపర్ సిరీస్ లో సత్తా చాటిన భారత బ్యాడ్మింటన్ క్రీడాకారుడు పారుపల్లి కశ్యప్ మరోసారి 'టాప్ టెన్' లోకి దూసుకొచ్చాడు. బీడబ్ల్యూ ఎఫ్ తాజాగా ప్రకటించిన పురుషుల సింగిల్స్ ప్రపంచ ర్యాంకింగ్స్ లో రెండు స్థానాలు ఎగబాకి 10వ ర్యాంకులో నిలిచాడు.
మరో ఇండియన్ ప్లేయర్ కిదాంబి శ్రీకాంత్ భారత్ తరపున అత్యుత్తమ ర్యాంకులో ఉన్నాడు. అతడు మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. మహిళల సింగిల్స్ లో సైనా నెహ్వాల్ రెండో ర్యాంకు దక్కించుకుంది. పీవీ సింధు 14వ ర్యాంకులో కొనసాగుతోంది.