చాంపియన్ నిజామాబాద్ | champion nizamabad in hockey tournment | Sakshi
Sakshi News home page

చాంపియన్ నిజామాబాద్

Published Thu, Feb 6 2014 1:18 AM | Last Updated on Wed, Oct 17 2018 6:14 PM

చాంపియన్ నిజామాబాద్ - Sakshi

 సీనియర్ హాకీ టోర్నీ
 నల్లగొండ, న్యూస్‌లైన్: కోమటి రెడ్డి ప్రతీక్ స్మారక తెలంగాణ అంతర్ జిల్లా పురుషుల సీనియర్ హాకీ టోర్నమెంట్‌లో నిజామాబాద్ జట్టు విజేతగా నిలిచింది. ఇక్కడి ఎన్జీ కాలేజీ గ్రౌండ్స్‌లో మూడు రోజుల పాటు జరిగిన ఈ టోర్నీ బుధవారం ముగిసింది. చివరి రోజు జరిగిన సూపర్ లీగ్ మ్యాచుల్లో నిజామాబాద్ రెండు విజయాలు సాధించింది. తొలి మ్యాచ్‌లో ఆ జట్టు  6-1 గోల్స్ తేడాతో వరంగల్‌ను ఓడించింది. నిజామాబాద్ తరఫున శివ, యోగేశ్ చెరో 3 గోల్స్ చేశారు. రెండో మ్యాచ్‌లోనూ నిజామాబాద్ నల్లగొండపై 4-1తో విజయం సాధించింది. శివ 2, యోగేశ్, సుమన్ చెరో గోల్ చేశారు. మరో మ్యాచ్‌లో వరంగల్‌ను 2-0తో ఓడించి నల్లగొండ రెండో స్థానంలో నిలిచింది.
 
  నల్లగొండ తరఫున లోకేశ్, కిరణ్ చెరో గోల్ సాధించారు. సూపర్ లీగ్‌లో రెండు మ్యాచ్‌లూ ఓడిన వరంగల్ మూడో స్థానంతో సంతృప్తి పడింది. ముగింపు కార్యక్రమంలో ఎమ్మెల్యే కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, హాకీ ఇండియా సంయుక్త కార్యదర్శి నిరంజన్ రెడ్డి, ఏపీ ఒలింపిక్ సంఘం కార్యదర్శి జగదీశ్వర్ యాదవ్, నల్లగొండ హాకీ సంఘం అధ్యక్షుడు మెరుగు గోపి తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement