చెన్నై: భారత గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్కు ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్ ఐదో గేమ్లో చుక్కెదురైంది. మాగ్నస్ కార్ల్‌సెన్తో శుక్రవారం జరిగిన మ్యాచ్ లో ఆనంద్ ఓటమి చవిచూశాడు. విశ్వనాథన్ ఆనంద్ ఎత్తుల్ని ప్రపంచ ఛాంపియన్ కార్ల్సెన్ చాకచక్యంతో అధిగమించి తొలి విజయాన్ని అందుకున్నాడు. అంతకుముందు జరిగిన నాలుగు గేమ్లను డ్రా చేసుకుని సమ ఉజ్జీలుగా ఉన్నా, తాజాగా కార్ల్సెన్ దూకుడుగా ఆడి గెలుపు బావుటా ఎగురవేశాడు.
బుధవారం ఇరువురి మధ్య జరిగిన నాలుగో గేమ్ కూడా 64 ఎత్తుల వద్ద డ్రా అయ్యింది. బుధవారం జరిగిన ఈమ్యాచ్ తరువాత ఒకరోజు విరామం లభించింది. ఈ రోజు ఇద్దరు మధ్య ఆసక్తికర పోరు జరిగినా ఓటమి చతికిలబడ్డాడు.