
వెల్లింగ్టన్: న్యూజిలాండ్‌తో ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో క్లీన్‌స్వీప్‌కు గురైన పాకిస్తాన్ ఆట టి20ల్లోనూ మారలేదు. ఫలితంగా తొలి టి20లోనూ ఆ జట్టుకు ఘోర పరాజయం ఎదురైంది. సోమవారం ఇక్కడ జరిగిన తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్ 7 వికెట్ల తేడాతో పాక్‌ను చిత్తు చేసింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పాక్ 19.3 ఓవర్లలో 105 పరుగులకే ఆలౌటైంది. బాబర్ ఆజమ్ (41 బంతుల్లో 41; 1 ఫోర్, 1 సిక్స్) టాప్ స్కోరర్‌గా నిలవగా... హసన్ అలీ (23) ఫర్వాలేదనిపించాడు. సౌతీ, రాన్స్ చెరో 3 వికెట్లు పడగొట్టారు.
అనంతరం న్యూజిలాండ్ 15.5 ఓవర్లలోనే 2 వికెట్లకు 106 పరుగులు చేసి విజయాన్నందుకుంది. 8 పరుగులకే ఆ జట్టు 2 వికెట్లు కోల్పోయినా... ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ కొలిన్ మున్రో (43 బంతుల్లో 49 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), బ్రూస్ (26), రాస్ టేలర్ (22 నాటౌట్) కలిసి జట్టును గెలిపించారు. ఇరు జట్ల మధ్య రెండో టి20 మ్యాచ్ గురువారం ఆక్లాండ్‌లో జరుగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment