అది క్రికెట్ అదృష్టం: మెకల్లమ్ | Cricket is Lucky to Have 'Superstar' Virat Kohli, says Brendon McCullum | Sakshi
Sakshi News home page

అది క్రికెట్ అదృష్టం: మెకల్లమ్

Published Thu, Dec 15 2016 1:28 PM | Last Updated on Tue, Sep 18 2018 8:48 PM

అది క్రికెట్ అదృష్టం: మెకల్లమ్ - Sakshi

అది క్రికెట్ అదృష్టం: మెకల్లమ్

వెల్లింగ్టన్:టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లిపై న్యూజిలాండ్ దిగ్గజ ఆటగాడు, మాజీ కెప్టెన్ బ్రెండన్ మెకల్లమ్ ప్రశంసల వర్షం కురిపించాడు. విరాట్ కోహ్లి లాంటి ఆటగాడు క్రికెట్లో ఉండటం గేమ్ చేసుకున్న అదృష్టమంటూ ఆకాశానికెత్తేశాడు. గత కొంతకాలం నుంచి ఏ ఫార్మాట్లో చూసినా విరాట్ హవానే నడుస్తుందని కొనియాడాడు. క్రికెట్ క్రీడకు విరాట్ ఒక సూపర్ స్టార్ అనడంలో ఎటువంటి సందేహం లేదన్నాడు. ఫీల్డ్లో విధ్వంసకర ఆటతీరుతో చెలరేగే కోహ్లి.. తన కెరీర్లో ఎప్పుడూ హద్దులు దాటి ప్రవర్తించేలేదన్నాడు.

 

ఫీల్డ్లో దూకుడును చూపట్టే కోహ్లి.. మైదానం బయటం ఎంతో హుందాగా ఉంటాడని  పేర్కొన్నాడు. ఇలా ఉండటం కచ్చితంగా ఎవరికైనా సవాల్ వంటిదని మెకల్లమ్ పేర్కొన్నాడు.  ఈ తరహా లక్షణాలున్న విరాట్.. క్రికెట్లో ఉండటం ఆ గేమ్ చేసుకున్న అదృష్టమన్నాడు. చాలాకాలం నుంచి విరాట్ అత్యంత నిలకడగా ఆటను కొనసాగించడమే అతని పట్టుదలకు నిదర్శమన్నాడు. ఒకవైపు ఫిట్నెస్ను కాపాడుకుంటూ, మరొకవైపు అత్యుత్తమ స్థాయి ప్రదర్శన చేస్తున్న కోహ్లి ఎవ్వరికీ అందనంత ఎత్తులో నిలిచాడన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement