పోర్ట్‌ఎలిజిబెత్: ఇటీవల ఆస్ట్రేలియా-దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగిన తొలి టెస్టు నాల్గో రోజు ఆటలో డేవిడ్ వార్నర్-డీకాక్‌ల మధ్య తారాస్థాయిలో వాగ్వాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఒకానొక సమయంలో సహనం కోల్పోయిన డేవిడ్ వార్నర్.. డీకాక్‌పై దూసుకెళ్లే యత్నం చేశాడు. అయితే సహచర ఆటగాళ్లు వార్నర్‌ను ఆసీస్ డ్రెస్సింగ్ రూమ్‌లోకి తీసుకెళ్లి గొడవను సద్దుమణిచే యత్నం చేశారు. అయితే ఇంత దురుసుగా ప్రవర్తించడానికి తన భార్యను టార్గెట్ చేస్తూ డీకాక్ తిట్టడమేనని వార్నర్ వివరణ కూడా ఇచ్చాడు. అతని ప్రవర్తనకు గాను మ్యాచ్ ఫీజులో 75 శాతం జరిమానా కూడా పడింది.
అయితే ఈ వివాదానికి మరోసారి ఆజ్యం పోసేలా వ్యవహరించారు దక్షిణాఫ్రికా క్రికెట్ అధికారులు. ప్రధానంగా వార్నర్‌ను అవమానపరిచేలా వ్యవహరించారు. వార‍్నర్ భార్య కాండిస్ మాజీ ప్రియుడైన సోనీ బిల్ విలియమ్స్ మాస్క్‌లు ధరించిన సౌతాఫ్రికా అభిమానులతో కలిసి ఆ దేశ క్రికెట్ ఎగ్జిక్యూటివ్‌లు క్లైవ్ ఎక్‌స్టీన్, అల్తాఫ్ ఖాజీలు ఫోటోలకు ఫోజిచ్చారు. ఇదంతా పోర్ట్‌ఎలిజిబెత్‌లో రెండో టెస్టుకు ఆరంభానికి ముందు జరిగింది. ఈ వ్యవహారంలో డేవిడ్ వార్నర్‌కు సీఎస్‌ఏ క్షమాపణలు తెలియజేసింది. వీరిపై చర్యలు తీసుకునేందుకు నడుంబిగించింది. ఇలా తమ దేశ క్రికెటర్‌ను కించపరిచేందుకు దక్షిణాఫ్రికా క్రికెట్ అధికారులు సహకరించడంపై ఆసీస్ గుర్రుగా ఉంది. గతంలో న్యూజిలాండ్ రగ్బీ ఆటగాడైన సోనీ బిల్ విలియమ్స్-కాండిస్‌లు చాలా కాలం చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. అయితే వీరి మధ్య చోటు చేసుకున్న విభేదాల కారణంగా సోనీ బిల్ విలియమ్స్-కాండిస్ ప్రేమాయాణానికి దాదాపు పదేళ్ల నాడే ఫుల్‌స్టాప్ పడింది. ఆ తర్వాత ఆసీస్ క్రికెటర్ వార్నర్‌ను కాండిస్ వివాహం చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment