రోమ్: కరోనా సంక్షోభంతో ప్రపంచమే స్తంభించిపోయింది. ఆర్థికం, వర్తకం, వాణిజ్యం, క్రీడా రంగం ఇలా ఏ రంగాన్ని మహమ్మారి వదల్లేదు. ఈ నేపథ్యంలో సాకర్ లీగ్‌లు జరగకపోవడంతో ఇటలీలోని విఖ్యాత క్లబ్ యువెంటస్ ఆర్థిక ఇబ్బందులను గుర్తించిన సాకర్ స్టార్లు తమ వేతనాల కోతకు అంగీకరించారు. అత్యధిక పారితోషికం అందుకున్న పోర్చుగల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో అధిక మొత్తం కోతకు సిద్ధపడ్డాడు. కోటీ 10 లక్షల డాలర్లు (రూ. 83 కోట్లు) వదులుకునేందుకు అతను అంగీకరించాడు. అతనితో మిగతా ఆటగాళ్లు, కోచ్ మారిజియో సారి కూడా కోతకు సమ్మతించారు. దీంతో మొత్తంమీద 100 మిలియన్ డాలర్లు (రూ.754 కోట్లు) మేర క్లబ్‌కు ఆదా కానుంది. ఇది యువెంటస్ క్లబ్‌కు లభించిన పెద్ద మొత్తం ఊరట. కష్టకాలంలో తమ ఆటగాళ్లు వేతనాల కోతతో క్లబ్‌కు అండగా నిలిచారని యువెంటస్ క్లబ్ హర్షం వెలిబుచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment