భారత్-ఆస్ట్రేలియా ఐదో వన్డే రద్దు! | Cuttack ODI likely to be cancelled tomorrow | Sakshi
Sakshi News home page

భారత్-ఆస్ట్రేలియా ఐదో వన్డే రద్దు!

Published Fri, Oct 25 2013 7:14 PM | Last Updated on Fri, Sep 1 2017 11:58 PM

భారత్-ఆస్ట్రేలియా ఐదో వన్డే రద్దు!

భారత్-ఆస్ట్రేలియా ఐదో వన్డే రద్దు!

కటక్: భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఒడిశాలోని కటక్‌లో రేపు జరగాల్సిన ఐదో వన్డే మ్యాచ్ దాదాపు రద్దయింది. అధికార ప్రకటన రేపు వెలువడుతుంది. శనివారం ఉదయం 11 గంటలకు అంపైర్లు పిచ్ పరిశీలించిన తర్వాత మ్యాచ్ రద్దుపై అధికారిక ప్రకటన చేస్తారని ఒడిశా క్రికెట్ అసోసియేషన్(ఓసీఏ)  కార్యదర్శి ఆశీర్వాద్ బెహరా తెలిపారు. టిక్కెట్ డబ్బులు తిరిగి ఇచ్చేసేందుకు తేదీలు కూడా ప్రకటించామని చెప్పారు.

రెండేళ్ల తర్వాత అంతర్జాతీయ మ్యాచ్కు ఆతిథ్యం ఇస్తున్న ఓసీఏకు వర్షం రూపంలో ఎదురుదెబ్బ తగిలింది. దీంతో ఓసీఏ దాదాపు రూ. 3 కోట్లు నష్టపోనుంది. బీమా సొమ్మును క్లైమ్ చేసుకోవడం ద్వారా కొంతవరకు కోలుకోగలమని ఓసీఏ భావిస్తోంది. మరోవైపు వెస్టిండీస్, ఉత్తరప్రదేశ్ 'ఎ' జట్ల మధ్య ఈ నెల 31 నుంచి జరగనున్న మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ను ఇక్కడ నుంచి తరలించాలని బీసీసీఐ అధ్యక్షుడు ఎన్ శ్రీనివాసన్ను కోరినట్టు ఆశీర్వాద్ బెహరా వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement