OCA
-
ప్రభుత్వంతో మాట్లాడతా...
నిషేధంపై ఐఓఏ అధ్యక్షుడు రామచంద్రన్ న్యూఢిల్లీ: కేంద్రం విధించిన నిషేధంపై భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) అధ్యక్షుడు ఎన్.రామచంద్రన్ స్పందించారు. త్వరలోనే అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ), ఆసియా ఒలింపిక్ మండలి (ఓసీఏ)లను సంప్రదించిన అనంతరం ఈ విషయమై క్రీడా శాఖతో మాట్లాడతానని చెప్పారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న సురేశ్ కల్మాడీ, అభయ్ సింగ్ చౌతాలాలను ఐఓఏ జీవితకాల గౌరవ అధ్యక్షులుగా నియమించడం తీవ్ర వివాదానికి దారి తీసిన విషయం తెలిసిందే. ఈ అంశంపై క్రీడా శాఖ ఐఓఏకు షోకాజ్ నోటీసు ఇవ్వగా అటు నుంచి స్పందన లేకపోవడంతో నిషేధం విధించింది. నిషేధంపై బింద్రా మద్దతు ఐఓఏపై నిషేధాన్ని మాజీ షూటర్ అభినవ్ బింద్రా సమర్థించారు. కేంద్రం మంచి నిర్ణయం తీసుకుందని తెలిపారు. ‘కఠినంగా ఉంటేనే భారత క్రీడారంగంలో మార్పు కనిపిస్తుంది. చట్టం తేవాల్సిన అవసరం ఉంది. క్రీడా శాఖ ఐఓఏను నిషేధించడం సరైన చర్య. సుపరిపాలన, నీతి నియమాల కాలం ఇది’ అని బింద్రా ట్వీట్ చేశారు. -
భారత్-ఆస్ట్రేలియా ఐదో వన్డే రద్దు!
కటక్: భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఒడిశాలోని కటక్లో రేపు జరగాల్సిన ఐదో వన్డే మ్యాచ్ దాదాపు రద్దయింది. అధికార ప్రకటన రేపు వెలువడుతుంది. శనివారం ఉదయం 11 గంటలకు అంపైర్లు పిచ్ పరిశీలించిన తర్వాత మ్యాచ్ రద్దుపై అధికారిక ప్రకటన చేస్తారని ఒడిశా క్రికెట్ అసోసియేషన్(ఓసీఏ) కార్యదర్శి ఆశీర్వాద్ బెహరా తెలిపారు. టిక్కెట్ డబ్బులు తిరిగి ఇచ్చేసేందుకు తేదీలు కూడా ప్రకటించామని చెప్పారు. రెండేళ్ల తర్వాత అంతర్జాతీయ మ్యాచ్కు ఆతిథ్యం ఇస్తున్న ఓసీఏకు వర్షం రూపంలో ఎదురుదెబ్బ తగిలింది. దీంతో ఓసీఏ దాదాపు రూ. 3 కోట్లు నష్టపోనుంది. బీమా సొమ్మును క్లైమ్ చేసుకోవడం ద్వారా కొంతవరకు కోలుకోగలమని ఓసీఏ భావిస్తోంది. మరోవైపు వెస్టిండీస్, ఉత్తరప్రదేశ్ 'ఎ' జట్ల మధ్య ఈ నెల 31 నుంచి జరగనున్న మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ను ఇక్కడ నుంచి తరలించాలని బీసీసీఐ అధ్యక్షుడు ఎన్ శ్రీనివాసన్ను కోరినట్టు ఆశీర్వాద్ బెహరా వెల్లడించారు.