డర్బన్: దక్షిణాఫ్రికా క్రికెట్ స్పీడ్ గన్ డేల్ స్టెయిన్ అరుదైన ఫీట్‌ను సాధించాడు. ప్రపంచ టెస్టు క్రికెట్‌లో అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్ల జాబితాలో ఏడో స్థానంలో నిలిచాడు. శ్రీలంకతో తొలి టెస్టులో భాగంగా మొదటి ఇన్నింగ్స్‌లో స్టెయిన్ ఆకట్టుకునే ప్రదర్శన చేశాడు. నాలుగు ప్రధాన వికెట్లు సాధించి శ్రీలంక పతనాన్ని శాసించాడు. ఫలితంగా టెస్టు క్రికెట్‌లో 437వ వికెట్లను ఖాతాలో వేసుకున్నాడు. ఇక్కడ ఇంగ్లండ్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్‌తో కలిసి సంయుక్తంగా ఏడో స్థానాన్ని ఆక‍్రమించాడు. అయితే భారత దిగ్గజ బౌలర్ కపిల్‌దేవ్(434 వికెట్లు)ను స్టెయిన్ దాటేశాడు.
తన కెరీర్‌లో 92వ టెస్టు మ్యాచ్ ఆడుతున్న స్టెయిన్.. 26సార్లు ఐదు వికెట్లను సాధించాడు. కాగా, టెస్టు క్రికెట్‌లో అత్యధిక వికెట్లు సాధించిన వారిలో ముత్తయ్య మురళీ ధరన్(800వికెట్లు) తొలి స్థానంలో ఉండగా, షేన్ వార్న్(708) రెండో స్థానంలో ఉన్నాడు. ఇక అనిల్ కుంబ్లే(619), జేమ్స్ అండర్సన్(575), మెక్‌గ్రాత్(563), కర్ట్నీ వాల్ష్(516)లు ఆ తర్వాత వరుస స్థానాల్లో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment