
సాక్షి, హైదరాబాద్: సిటీ కాలేజి ఓల్డ్ బాయ్స్ (సీసీఓబీ) ఫుట్‌బాల్ క్లబ్ ఆధ్వర్యంలో జరుగుతోన్న సీసీఓబీ కప్ ప్రైజ్‌మనీ ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో దారుల్‌షిఫా, ఏజీ ఫ్రెండ్స్ జట్లు ఫైనల్‌కు చేరుకున్నాయి. కులీ కుతుబ్‌షా మైదానంలో శనివారం జరిగిన తొలి సెమీస్‌లో దారుల్‌షిఫా 4–2తో సీసీఓబీపై గెలుపొందింది. విజేత జట్టులో అబిద్ 2, ఇర్ఫాన్, నమిత్ చెరో గోల్ చేశారు. సీసీఓబీ తరఫున నికేశ్, అజీమ్ ఒక్కో గోల్ సాధించారు.
రెండో సెమీస్‌లో ఏజీ ఫ్రెండ్స్ 5–0తో తార్నాక ఎఫ్‌సీ జట్టుపై ఘనవిజయం సాధించి టైటిల్‌పోరుకు అర్హత సాధించింది. ఏజీ ఫ్రెండ్స్ తరఫున రఫీక్, తల్హా చెరో 2 గోల్స్ చేయగా... జోషువా ఒక గోల్ సాధించాడు.
Comments
Please login to add a commentAdd a comment