
సాక్షి, హైదరాబాద్: రిలయన్స్ ఫౌండేషన్ యూత్ స్పోర్ట్స్ (ఆర్‌ఎఫ్‌వైఎస్) ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో ఇంటర్నేషనల్ స్కూల్ జట్టు ఫైనల్‌కు చేరింది. లయోలా డిగ్రీ కాలేజి ప్రాంగణంలో జరిగిన స్కూల్ బాలికల సెమీస్‌లో ఇంటర్నేషనల్ స్కూల్ 2–0తో ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్‌పై గెలుపొందింది.
జూనియర్ బాలుర విభాగంలో తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్ 6–0తో డాన్‌బాస్కోపై, సీనియర్ బాలుర విభాగంలో సెయింట్ మేరీస్ జూనియర్ కాలేజి 4–1తో గీతాంజలి సీనియర్ స్కూల్‌పై, కాలేజి బాలుర విభాగంలో వెస్లీ డిగ్రీ కాలేజి 3–1తో శ్రీనిధి ఇన్‌స్టిట్యూట్‌పై గెలుపొంది టైటిల్‌పోరుకు అర్హత సాధించాయి.
Comments
Please login to add a commentAdd a comment