సిడ్నీ: బాల్ ట్యాంపరింగ్ వివాదం కారణంగా నిషేధం ఎదుర్కొంటున్న ఆసీస్ క్రికెటర్ డేవిడ్ వార్నర్.. ఆ ఉదంతంతో ఇప్పటికీ సిగ్గుపడుతున్నట్లు పేర్కొన్నాడు. కొన్ని నెలల క్రితం దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌లో బాల్ ట్యాంపరింగ్ కారణంగా స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్‌లపై ఏడాదిపాటు నిషేధం పడింది. బౌలర్ బెన్ క్రాఫ్ట్‌పై తొమ్మిది నెలల విధించింది క్రికెట్ ఆస్ట్రేలియా. అప్పట్నుంచి దేశవాళీ టోర్నీలకు మాత్రమే వీరు పరిమితమయ్యారు. ఈ క్రమంలోనే తాజాగా స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్ ఇద్దరూ ప్రత్యర్థులుగా ఆస్ట్రేలియాలోని దేశవాళీ టీ20లో తొలిసారిగా ఆడారు.
ఈ క్రమంలో వార్నర్ మాట్లాడుతూ.. ‘బాల్ ట్యాంపరింగ్ చర్య నన్నెంతగానో నిరాశకు గురిచేసింది. ఆ చర్యతో సిగ్గుపడుతున్నా. అయితే సీఏ విధించిన ఏడాది సస్పెన్షన్ పూర్తి అయ్యేంత వరకూ శిక్ష అనుభవిస్తాను. అనంతరం తిరిగి వచ్చే ప్రపంచకప్ నాటికల్లా జాతీయ జట్టుకు ఆడటమే నా లక్ష్యం.’ అని చెప్పుకొచ్చాడు. మరొవైపు స్మిత్‌తో తనకు సత్సంబంధాలు లేవనే వార్తలను వార్నర్ ఖండించాడు. వాటిలో ఎంతమాత్రం వాస్తవం లేదన్నాడు. గతంలో తామిద్దరం ఎలా ఉన్నామో, బాల్ ట్యాంపరింగ్ ఉదంతం తర్వాత కూడా అలానే ఉన్నామన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment