హెడింగ్లీ: ఇంగ్లండ్ యువ బౌలర్ జోఫ్రా ఆర్చర్ యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌కు నిద్రలేని రాత్రులను మిగులుస్తున్నాడు. యాషెస్ సిరీస్‌లో భాగంగా రెండో టెస్టులో ఇంగ్లండ్ తరుపున అరంగేట్రం చేసిన ఈ బౌలర్ తొలి మ్యాచ్‌లోనే ఆసీస్ బ్యాట్స్‌మెన్ వెన్నుల్లో వణుకుపుట్టించాడు. తాజాగా మూడో టెస్టులో కంగారు బ్యాట్స్‌మెన్‌ను ఠారెత్తించాడు. గురువారం ప్రారంభమైన మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆర్చర్ ఆరు వికెట్లు పడగొట్టి ఆసీస్ పతనాన్ని శాసించాడు. అయితే మ్యాచ్ అనంతరం ఆసీస్ స్టార్ బ్యాట్స్‌మన్, ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఆర్చర్‌ను ఆకాశానికి ఎత్తాడు.
‘కొత్త బంతితో ఆర్చర్ బౌలింగ్ విధానం చూస్తుంటే నాకు డేల్ స్టెయిన్ గుర్తుకువస్తున్నాడు. వేగంతో పాటు పేస్‌లో వైవిద్యాన్ని ప్రదర్శిస్తున్నాడు. పిచ్, మ్యాచ్ పరిస్థితులకు తగ్గట్టు బౌలింగ్ చేస్తున్నాడు. ఆర్చర్ ఇప్పుడే ప్రపంచ శ్రేణి బౌలర్‌ను తలపిస్తున్నాడు’అంటూ వార్నర్ పేర్కొన్నాడు. అరంగేట్రపు టెస్టులోనే ఐదు వికెట్లన సాధించిన ఆర్చర్ అందరి మన్ననలను పొందాడు. లార్డ్స్ టెస్టులోనే ఆర్చర్ వేసిన షార్ట్ బాల్ ఆసీస్ స్టార్ బ్యాట్స్‌మన్ స్టీవ్ స్మిత్ మెడకు తగిలి గాయపడిన విషయం తెలిసిందే. ఈ గాయం కారణంగానే మూడో టెస్టుకు స్మిత్ దూరమైన విషయం తెలిసిందే.
చదవండి:
అచ్చం స్మిత్‌లానే..!
ఆర్చర్‌పై ఆసీస్ మాజీ బౌలర్ ప్రశంసలు
Comments
Please login to add a commentAdd a comment