‘వదినమ్మా.. తను ఇప్పుడు హైదరాబాదీనే’ | David Warner Wife Emotional Message After SRH Win | Sakshi
Sakshi News home page

వీలైతే ఫైనల్‌ మ్యాచ్‌కు రా వార్నర్‌!!

Published Tue, Apr 30 2019 2:00 PM | Last Updated on Tue, Apr 30 2019 10:42 PM

David Warner Wife Emotional Message After SRH Win - Sakshi

ఐపీఎల్‌ సీజన్‌ 12లో భాగంగా పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో నెగ్గి సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు ప్లే ఆఫ్‌ రేసులో నిలిచిన సంగతి తెలిసిందే.. సోమవారం సొంతగడ్డపై జరిగిన మ్యాచ్‌లో 45 పరుగుల తేడాతో విజయం సాధించిన సన్‌రైజర్స్‌.. రెండు వరుస పరాజయాలతో నిరాశ చెందిన ఆరెంజ్‌ ఆర్మీకి కొత్త ఉత్సాహాన్ని తెచ్చింది. ఈ మ్యాచ్‌లో హాఫ్‌ సెంచరీతో ఆకట్టుకున్న(56 బంతుల్లో 81; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) స్టార్‌ బ్యాట్స్‌మెన్‌, ఆసీస్‌ ఆటగాడు డేవిడ్‌ వార్నర్‌ జట్టు విజయంలో మరోసారి కీలక పాత్ర పోషించాడు. పిచ్‌ పూర్తిగా బ్యాటింగ్‌కు సహకరించడంతో దూకుడుగా ఆడిన వార్నర్ పంజాబ్‌ బౌలర్లను చీల్చి చెండాడి ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా నిలిచాడు. వార్నర్‌ మెరుపుల కారణంగా జట్టు ప్లేఆఫ్‌ చేరే అవకాశం ఉండటంతో అభిమానులు అతడిపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

ఈ క్రమంలో వార్నర్‌ ఇన్నింగ్స్‌ గురించి...‘ అద్భుత ఇన్నింగ్స్‌తో ఐపీఎల్‌ సీజన్‌కు ముగింపు పలికావు. నిన్ను చూసి నేను, పిల్లలు ఎల్లప్పుడూ గర్వంగా ఫీలవుతాం. ఇతరులకు ఆదర్శంగా ఉండే ఆటిట్యూడ్‌ను నువ్వెప్పుడూ విడిచిపెట్టలేదు. వి లవ్‌ యూ’ అం‍టూ ఆరెంజ్‌ ఆర్మీ హ్యాష్‌ట్యాగ్‌ను జతచేస్తూ అతడి భార్య కాండిస్‌ చేసిన ట్వీట్‌ అభిమానులను ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలో... ‘మేము కూడా వార్నర్‌ను ఎంతగానో ప్రేమిస్తున్నాం. వదినమ్మా. అతడు కూడా ఇప్పుడు హైదరాబాదీనే. మిమ్మల్ని మిస్సవుతాము. వీలైతే మనం తలపడే ఫైనల్‌ మ్యాచ్‌కు వార్నర్‌ను అందుబాటులో ఉండమని చెప్పండి’ అంటూ వార్నర్‌పై అభిమానం చాటుకోవడంతో పాటు సన్‌రైజర్స్‌ ఫైనల్‌కు చేరుతుందన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాగా వచ్చే నెల 30 నుంచి ఇంగ్లండ్‌లో జరగనున్న ప్రపంచకప్‌ కోసం సన్నద్ధం కావడానికి వార్నర్‌ స్వదేశానికి పయనం కానున్న సంగతి తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement