![Defeat To New Zealand Not End Of The World, Kohli - Sakshi](/styles/webp/s3/article_images/2020/02/25/Kohli.jpg.webp?itok=iH97JD32)
వెల్లింగ్టన్: మేం బాగా ఆడలేదని తెలుసు. కానీ కొందరు ఈ ఓటమిని అవసరానికి మించి పెద్దదిగా చేసి చూపిస్తున్నారు. మేం ఆ రకంగా ఆలోచించడం లేదు. దీంతో ప్రపంచం ముగిసిపోయినట్లు కాదు. క్రికెట్ మ్యాచ్‌లోనే ఓడాం. అంతర్జాతీయ క్రికెట్‌లో ఏదీ సులువు కాదు. ప్రతీ జట్టు విజయం కోసమే ప్రయత్నిస్తుంది. బయటి వ్యక్తులు ఏం మాట్లాడుకుంటున్నారో మేం పట్టించుకోం. అలా చేస్తే మళ్లీ ఏడు లేదా ఎనిమిది ర్యాంక్‌కు పడిపోతాం. వరుసగా టెస్టులు గెలుస్తున్న జట్టు స్థాయి ఒక్క మ్యాచ్‌తో తగ్గిపోదు.(ఇక్కడ చదవండి: ఓటమి లాంఛనం ముగిసింది)
పరాజయాన్ని ఒప్పుకోవడంలో సిగ్గు పడాల్సిందేమీ లేదు. న్యూజిలాండ్ బౌలర్లు మాపై ఒత్తిడి పెంచేలా మేమే అవకాశమిచ్చాం. ఒకటి రెండు మంచి భాగస్వామ్యాలతో వారిని అడ్డుకోవాల్సింది. నా బ్యాటింగ్ గురించి ఆందోళన లేదు. నేను బాగానే ఆడుతున్నా. ఇంత సుదీర్ఘ క్రికెట్ ఆడుతున్నప్పుడు అప్పుడప్పుడూ విఫలం కావడం సహజం. తర్వాతి టెస్టు కోసం మరింతగా శ్రమించి సన్నద్ధమవుతాం.
–విరాట్ కోహ్లి, భారత కెప్టెన్
Comments
Please login to add a commentAdd a comment