ఇండియన్ ఏసెస్ శుభారంభం | Defending champions Indian Aces make winning start against Japan Warriors | Sakshi
Sakshi News home page

ఇండియన్ ఏసెస్ శుభారంభం

Published Thu, Dec 3 2015 12:30 AM | Last Updated on Sun, Sep 3 2017 1:23 PM

ఇండియన్ ఏసెస్ శుభారంభం

ఇండియన్ ఏసెస్ శుభారంభం

 ఐపీటీఎల్ సీజన్-2
 కోబ్ (జపాన్): అంతర్జాతీయ ప్రీమియర్ టెన్నిస్ లీగ్ (ఐపీటీఎల్) రెండో సీజన్‌లో డిఫెండింగ్ చాంపియన్ ఇండియన్ ఏసెస్ జట్టు శుభారంభం చేసింది. జపాన్ వారియర్స్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో ఇండియన్ ఏసెస్ 25-24 పాయింట్ల తేడాతో విజయం సాధించింది. తొలి మ్యాచ్‌గా జరిగిన మిక్స్‌డ్ డబుల్స్‌లో సానియా మీర్జా-రోహన్ బోపన్న (ఏసెస్) జంట 5-6తో షరపోవా-హెర్బర్ట్ (వారియర్స్) జోడీ చేతిలో ఓడిపోయింది. మహిళల సింగిల్స్‌లో షరపోవా 6-4తో సమంతా స్టోసుర్‌పై గెలిచింది. లెజెండ్స్ సింగిల్స్ మ్యాచ్‌లో ఫాబ్రిస్ సాంతోరో (ఏసెస్) 6-2తో మరాత్ సఫిన్ (వారియర్స్)ను ఓడించాడు.
 
  పురుషుల డబుల్స్ మ్యాచ్‌లో రోహన్ బోపన్న-మోన్‌ఫిల్స్ (ఏసెస్) ద్వయం 6-4తో నిషికోరి-హెర్బర్ట్ జంటను ఓడించింది. పురుషుల సింగిల్స్ మ్యాచ్‌లో నిషికోరి 6-4తో మోన్‌ఫిల్స్‌పై గెలిచాడు. వారియర్స్ జట్టు మూడు మ్యాచ్‌ల్లో నెగ్గినా... ఏసెస్ జట్టు ఎక్కువ గేమ్‌లు గెలిచినందుకు విజయాన్ని ఖాయం చేసుకుంది. మరో మ్యాచ్‌లో యూఏఈ రాయల్స్ 26-20తో సింగపూర్ స్లామర్స్‌ను ఓడించింది. సింగపూర్ స్లామర్స్ తరఫున ఆడాల్సిన ప్రపంచ నంబర్‌వన్ నొవాక్ జొకోవిచ్ విశ్రాంతి తీసుకోవాలనే ఉద్దేశంతో ఐపీటీఎల్ సీజన్-2 నుంచి వైదొలిగాడు. అతని స్థానంలో ఆండీ ముర్రే, వావ్రింకా బరిలోకి దిగనున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement