
సొంతగడ్డపై ఢిల్లీకి భంగపాటు
న్యూఢిల్లీ : ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) రెండో సీజన్‌లో సొంతగడ్డపై ఆడిన తొలి మ్యాచ్‌లోనే దబాంగ్ ఢిల్లీ జట్టుకు పరాజయం ఎదురైంది. శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లో ఢిల్లీ 17-20 తేడాతో బెంగాల్ వారియర్స్ జట్టు చేతిలో ఓడిపోయింది. బెంగాల్ జట్టుకిది రెండో విజయం. జాగ్రత్తగా ఆడుకుంటూ వెళ్లిన ఈ రెండు జట్లు ఒక్కసారి కూడా ఆలౌట్ కాలేకపోయాయి. ఢిల్లీ నుంచి కషిలింగ్ అడకే మూడు, బెంగాల్ నుంచి మహేంద్ర గణేష్ రాజ్‌పుత్ మూడు రైడ్ పాయింట్లు సాధించారు. తొలి అర్ధభాగంలో ఢిల్లీ ఆధిక్యం కనబరిచింది.
అయితే పాయింట్లు మాత్రం రెండు జట్లు కూడా నిదానంగా సాధించుకుంటూ వెళ్లాయి. ఫలితంగా తొలి 20 నిమిషాల్లో 9-8 మాత్రమే నమోదయ్యాయి. చివరి ఐదు నిమిషాల్లో బెంగాల్ జట్టు కాస్త పుంజుకుని ఒక్క పాయింట్ ఆధిక్యంతో 20-17తో ముగించింది. మరో మ్యాచ్‌లో పట్నా పైరేట్స్ 30-28 తేడాతో బెంగళూరు బుల్స్ జట్టుపై నెగ్గింది.