Bengal Warriors team
-
పట్నా పైరేట్స్ ఐదో విజయం
ముంబై: ప్రొ కబడ్డీ లీగ్ ఆరో సీజన్లో డిఫెండింగ్ చాంపియన్ పట్నా పైరేట్స్ ఐదో విజయం నమోదు చేసుకుంది. బెంగాల్ వారియర్స్‌తో శనివారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో పట్నా పైరేట్స్ 50–30తో గెలిచింది. ‘డుబ్కీ’ కింగ్ ప్రదీప్ నర్వాల్ 11, దీపక్ నర్వాల్ 13 పాయింట్లతో చెలరేగారు. ఈ మ్యాచ్‌ను బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ స్నేహితులతో కలిసి వీక్షించారు. మరో మ్యాచ్‌లో గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్ 38–36తో యు ముంబాపై విజయం సాధించింది. -
బెంగాల్40 40 యూపీ
పుణే: ప్రొ కబడ్డీ లీగ్‌లో బెంగాల్ వారియర్స్ జట్టు తొలి ‘డ్రా’ నమోదు చేసుకుంది. జోన్ ‘బి’లో భాగంగా శనివారం ఇక్కడ బెంగాల్ వారియర్స్, యూపీ యోధా మధ్య జరిగిన లీగ్ మ్యాచ్ 40–40తో డ్రాగా ముగిసింది. బెంగాల్ తరఫున మణిందర్ సింగ్ 16, జాంగ్ కున్ లీ 7 రైడ్ పాయింట్లు సాధించారు. ట్యాక్లింగ్‌లో సుర్జీత్ సింగ్ (6 పాయింట్లు) రాణించాడు. యూపీ తరఫున ప్రశాంత్ 13, రిషాంక్ 9 రైడ్ పాయింట్లు సాధించారు. మరో మ్యాచ్‌లో పుణేరీ పల్టన్ 33–32తో యు ముంబాపై గెలిచింది. నేటి మ్యాచ్‌ల్లో దబంగ్ ఢిల్లీతో బెంగాల్ వారియర్స్, పుణేరీ పల్టన్‌తో బెంగళూరు బుల్స్ తలపడతాయి. -
తెలుగు టైటాన్స్‌కు మరో ఓటమి
సాక్షి, విశాఖపట్నం: ప్రొ కబడ్డీ లీగ్‌లో సొంతగడ్డపై తమ పోరాటాన్ని తెలుగు టైటాన్స్ జట్టు ఓటమితో ముగించింది. మంగళవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ 17-25 పాయింట్ల తేడాతో బెంగాల్ వారియర్స్ జట్టు చేతిలో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌తో విశాఖపట్నంలో ప్రొ కబడ్డీ లీగ్ దశ పోటీలు ముగిశాయి. తొలి మ్యాచ్‌లో ఓడిపోయి... తర్వాతి రెండు మ్యాచ్‌ల్లో గెలిచి జోరు మీదున్నట్లు కనిపించిన టైటాన్స్ జట్టుకు బెంగాల్ జట్టు షాక్ ఇచ్చింది. దాంతో టైటాన్స్ సొంతగడ్డపై ‘హ్యాట్రిక్’ విజయాలను నమోదు చేయడంలో విఫలమైంది. తొలి అర్ధభాగంలో రెండు జట్లు నువ్వా నేనా అన్నట్లు పోరాడాయి. ఫలితంగా విరామ సమయానికి రెండు జట్లు 9-9తో సమఉజ్జీగా నిలిచాయి. రెండో అర్ధభాగం తొలి ఐదు నిమిషాల్లోనూ మ్యాచ్ హోరాహోరీగా సాగింది. స్కోరు 14-14తో సమంగా ఉన్న దశలో బెం గాల్ జట్టు వరుసగా మూడు పాయింట్లు సాధించి 17-14తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత ఇదే జోరును కనబరిచిన బెంగాల్ నిలకడగా రాణించి విజ యాన్ని ఖాయం చేసుకుంది. టైటాన్స్ జట్టు లో రోహిత్ బలియాన్, రాహుల్ చౌదరీ నాలుగేసి పాయింట్లు స్కోరు చేశారు. బెంగాల్ జట్టులో నితిన్ తోమర్ ఆరు పాయింట్లతో టాప్ స్కోరర్‌గా నిలువగా... గిరీవ్ మారుతి ఐదు పాయింట్లు... నీలేశ్ షిండే, మహేశ్ గౌడ్, మహేంద్ర గణేశ్ రాజ్‌పుత్ మూడేసి పాయింట్లు సాధించారు. బుధవారం బెంగళూరు వేదికగా జరిగే మ్యాచ్‌ల్లో బెంగళూరు బుల్స్‌తో పట్నా పైరేట్స్; దబంగ్ ఢిల్లీతో పుణేరి పల్టన్ తలపడతాయి. -
సొంతగడ్డపై ఢిల్లీకి భంగపాటు
న్యూఢిల్లీ : ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) రెండో సీజన్లో సొంతగడ్డపై ఆడిన తొలి మ్యాచ్‌లోనే దబాంగ్ ఢిల్లీ జట్టుకు పరాజయం ఎదురైంది. శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లో ఢిల్లీ 17-20 తేడాతో బెంగాల్ వారియర్స్ జట్టు చేతిలో ఓడిపోయింది. బెంగాల్ జట్టుకిది రెండో విజయం. జాగ్రత్తగా ఆడుకుంటూ వెళ్లిన ఈ రెండు జట్లు ఒక్కసారి కూడా ఆలౌట్ కాలేకపోయాయి. ఢిల్లీ నుంచి కషిలింగ్ అడకే మూడు, బెంగాల్ నుంచి మహేంద్ర గణేష్ రాజ్‌పుత్ మూడు రైడ్ పాయింట్లు సాధించారు. తొలి అర్ధభాగంలో ఢిల్లీ ఆధిక్యం కనబరిచింది. అయితే పాయింట్లు మాత్రం రెండు జట్లు కూడా నిదానంగా సాధించుకుంటూ వెళ్లాయి. ఫలితంగా తొలి 20 నిమిషాల్లో 9-8 మాత్రమే నమోదయ్యాయి. చివరి ఐదు నిమిషాల్లో బెంగాల్ జట్టు కాస్త పుంజుకుని ఒక్క పాయింట్ ఆధిక్యంతో 20-17తో ముగించింది. మరో మ్యాచ్‌లో పట్నా పైరేట్స్ 30-28 తేడాతో బెంగళూరు బుల్స్ జట్టుపై నెగ్గింది.