'భారత క్రికెట్లో అతను చాలా ప్రమాదకరం'
రాంచీ:న్యూజిలాండ్తో జరిగిన రాంచీలో జరిగిన నాల్గో వన్డేలో భారత్ క్రికెట్ జట్టు లక్ష్య ఛేదనలో వెనుబడి ఓటమి పాలైన సంగతి తెలిసిందే. కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని తో పాటు పలువురు టాపార్డర్ ఆటగాళ్లు వైఫల్యం చెందడంతో భారత జట్టు పరాజయం చవి చూసింది. అయితే భారత క్రికెట్ జట్టులో ధోని చాలా ప్రమాదకరమైన ఆటగాడు అని అంటున్నాడు న్యూజిలాండ్ దిగ్గజ ఆటగాడు బ్రెండన్ మెకల్లమ్. ప్రపంచ క్రికెట్లో అత్యంత ప్రభావం చూపిన ధోని అత్యంత ప్రమాదకరమైన ఆటగాడిగా అభివర్ణించాడు.
'ధోని గొప్ప నాయకుడు. అంతకంటే ప్రమాదకరమైన ఆటగాడు కూడా. ప్రస్తుతం టెస్టు క్రికెట్కు దూరంగా ఉంటున్న ధోని, పరిమిత ఓవర్ల క్రికెట్పైనే ఎక్కువ దృష్టి సారించాడు. ఆ క్రమంలోనే అతని బ్యాటింగ్ ఆర్డర్లో కూడా చాలా ముందుకొచ్చాడు. అతని ఆర్డర్లో ముందుకు రావడం మ్యాచ్లపై కచ్చితంగా ప్రభావం చూపుతుంది. అతను అలా నాల్గో స్థానంలో బ్యాటింగ్ రావడం నన్ను ఆశ్చర్యపరచలేదు. ధోని ఒక అద్భుతమైన క్రికెటర్. ప్రస్తుతం భారత క్రికెట్లో ఇద్దరు క్రికెటర్లకు చాలా అనుభవం ఉంది. అందులో ఒకరు ధోని అయితే, మరొకరు కోహ్లి. ఒత్తిడిలో కూడా మ్యాచ్లను తమవైపుకు తిప్పుకునే సామర్థ్యం వారి సొంతం. చాలా ప్రశాంతంగా వారి పని ముగిస్తారు. ఇలా లక్ష్య ఛేదనలో ఒకర్నినొకరు అర్ధం చేసుకుని విజయాల్ని సాధించడం అంత తేలిక కాదు. ఆ ఇద్దరి క్రికెటర్లు ఒకేసారి క్రీజ్లో ఉంటే అభిమానులకు తగినంత వినోదాన్నిఅందిస్తారు' అని మెకల్లమ్ అన్నాడు.