ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్ కోసం భారత జట్టు ఎంపిక వివాదాస్పదంగా మారింది. టోర్నీ కోసం ఎంపికైన పదిమంది ఆటగాళ్లలో తమ పేర్లు లేకపోవడంతో దినేష్ (91కేజీ), దిల్‌బాగ్ సింగ్ (69కేజీ), ప్రవీణ్ కుమార్ (+91కేజీ) ప్యానెల్‌పై ధ్వజమెత్తారు.
పాటియాల: ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్ కోసం భారత జట్టు ఎంపిక వివాదాస్పదంగా మారింది. టోర్నీ కోసం ఎంపికైన పదిమంది ఆటగాళ్లలో తమ పేర్లు లేకపోవడంతో దినేష్ (91కేజీ), దిల్‌బాగ్ సింగ్ (69కేజీ), ప్రవీణ్ కుమార్ (+91కేజీ) ప్యానెల్‌పై ధ్వజమెత్తారు. అవసరమైతే కోర్టుకెక్కుతామని హెచ్చరించారు. ట్రయల్ బౌట్స్‌లో తమ ప్రదర్శన మెరుగ్గానే ఉన్నా కోచ్‌లు, సెలక్షన్ కమిటీ కుట్రపూరితంగా వ్యవహరించారని ఆరోపించారు. అయితే బుధవారం జరిగిన బౌట్స్‌లో ఈ ముగ్గురిపై ఇతర బాక్సర్లు నెగ్గారు. కానీ సరైన రీతిలో ఎంపిక చేయని సెలక్షన్ కమిటీని కోర్టుకీడ్చుతామని దినేష్ తేల్చి చెప్పాడు. ఒలింపియన్ అఖిల్ కుమార్ తెర వెనుక ఉండి తన ఎంపికకు అడ్డుపడ్డాడని 11 సార్లు జాతీయ చాంప్‌గా నిలిచిన దిల్‌బాగ్ ఆరోపించాడు. మరోవైపు ఈ ఆరోపణలపై అఖిల్ స్పందిస్తూ దిల్‌బాగ్‌పై పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించాడు. ఎంపిక ట్రయల్స్ అన్నీ బహిరంగంగానే జరిగాయని, అయినా బాక్సర్లు ఇలాంటి ఆరోపణలు చేయడం తగదని, వారి ఫిర్యాదులకు సమాధానమిచ్చేందుకు ప్రయత్నిస్తామని భారత బాక్సింగ్ సమాఖ్య (ఐబీఎఫ్) ప్రధాన కార్యదర్శి రాజేశ్ భండారి అన్నారు.
ఎన్నికలకు మరో నెల గడుపు పొడిగింపు
సస్పెండ్‌కు గురైన అఖిల భారత బాక్సింగ్ సమాఖ్య (ఐబీఎఫ్)కు ఎన్నికల విషయంలో కొద్దిగా ఊరట లభించింది. ఇంతకుముందు నవంబర్ 4న తమ రీ ఎలక్షన్స్ జరపాలని ఆదేశించిన ప్రపంచ బాక్సింగ్ సమాఖ్య (ఐబా) ఐబీఎఫ్ విన్నతితో ఈ గడువును మరో నెల పొడిగించింది. తమ సస్పెన్షన్‌ను తొలగించుకునేందుకు ఐబీఎఫ్ చేస్తున్న ప్రయత్నాలు సంతృప్తికరంగానే ఉన్నాయని ఐబా కమ్యూనికేషన్ డెరైక్టర్ సెబాస్టియన్ గిల్లట్ అన్నారు.