పుణే: కేపీఐటీ-ఎమ్‌ఎస్‌ఎల్‌టీఏ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్‌లో దివిజ్ శరణ్-పురవ్ రాజా (భారత్) జోడీ టైటిల్ సాధించింది. శనివారం జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్లో దివిజ్-పురవ్ ద్వయం 3-6, 6-3, 11-9తో ‘సూపర్ టైబ్రేక్’లో లుకా మార్గరోలి (స్విట్జర్లాండ్)-హుగో నిస్ (ఫ్రాన్‌స) జంటపై విజయం సాధించింది.
పురుషుల సింగిల్స్ విభాగంలో భారత ప్లేయర్ ప్రజ్ఞేష్ గుణేశ్వరన్ రన్నరప్‌గా నిలిచాడు. ఫైనల్లో ప్రజ్ఞేష్ 6-4, 4-6, 3-6తో సాడియో డుంబియా (ఫ్రాన్‌స) చేతిలో ఓడిపోయాడు.
దివిజ్-పురవ్ జంటకు డబుల్స్ టైటిల్
Published Sun, Oct 30 2016 2:08 AM | Last Updated on Mon, Sep 4 2017 6:41 PM
Advertisement
Advertisement