prajnes
-
ప్రజ్నేశ్‌తో సాకేత్ అమీతుమీ
బెంగళూరు: వరుసగా రెండో ఏడాది భారత క్రీడాకారుడి ఖాతాలోనే బెంగళూరు ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్ టైటిల్ చేరనుంది. గతేడాది సుమీత్ నాగల్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను సొంతం చేసుకోగా... ఈ సంవత్సరం భారత డేవిస్ కప్ జట్టు సభ్యులు సాకేత్ మైనేని, ప్రజ్నేశ్ గుణేశ్వరన్ టైటిల్ కోసం నేడు అమీతుమీ తేల్చుకోనున్నారు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్స్‌లో ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ సాకేత్ మైనేని 4–6, 6–4, 6–4తో అలెగ్జాండర్ నెదోవ్‌యెసోవ్ (కజకిస్తాన్)పై గెలుపొందగా... ప్రజ్నేశ్ 6–4, 6–1తో బ్రైడెన్ ష్నుర్ (కెనడా)ను చిత్తుగా ఓడించాడు. నెదోవ్‌యెసోవ్‌తో జరిగిన మ్యాచ్‌లో నిర్ణాయక మూడో సెట్లో సాకేత్ 5–0తో ఆధిక్యంలోకి వెళ్లి ఆ తర్వాత వరుసగా నాలుగు గేమ్‌లు చేజార్చుకున్నాడు. అయితే పదో గేమ్‌లో పైచేయి సాధించి సెట్‌తోపాటు మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు. పురుషుల డబుల్స్ విభాగంలో పురవ్ రాజా (భారత్)–ఆంటోనియో సాన్సిచ్ (క్రొయేషియా) జోడీ రన్నరప్‌గా నిలిచింది. ఫైనల్లో పురవ్ రాజా–సాన్సిచ్ ద్వయం 6–7 (3/7), 3–6తో మాక్స్ పర్సెల్–ల్యూక్ సావిల్లె (ఆస్ట్రేలియా) జంట చేతిలో ఓడిపోయింది. -
‘రివర్స్’లో చెరొకటి
► రామ్‌కుమార్ గెలుపు... ప్రజ్నేశ్ ఓటమి ► ఉజ్బెకిస్తాన్‌పై భారత్ 4–1తో విజయం బెంగళూరు: డేవిస్ కప్ ఆసియా ఓసియానియా గ్రూప్–1 రెండో రౌండ్ మ్యాచ్‌లో భారత టెన్నిస్ జట్టు క్లీన్‌స్వీప్ చేసే అవకాశాన్ని చేజార్చుకుంది. రివర్స్ సింగిల్స్‌లో భారత్, ఉజ్బెకిస్తాన్లు చెరో మ్యాచ్ గెలిచాయి. దీంతో భారత్ 4–1 గెలుపుతో సరిపెట్టుకుంది. ఆదివారం జరిగిన తొలి రివర్స్ సింగిల్స్‌లో రామ్‌కుమార్ రామనాథన్ గెలుపొంది భారత్ ఆధిపత్యాన్ని చాటాడు. రామ్‌కుమార్ 6–3, 6–2తో సంజార్ ఫెజీవ్ను కంగుతినిపించాడు. 67 నిమిషాల పాటు జరిగిన ఈ పోరులో ప్రత్యర్థిపై రెండు సెట్లలోనూ రామ్‌కుమారే పైచేయి సాధించాడు. తర్వాత జరిగిన రెండో రివర్స్ సింగిల్స్‌లో ప్రజ్నేశ్ గుణేశ్వరన్ 5–7, 3–6తో ఇస్మాయిలోవ్ చేతిలో పరాజయం చవిచూశాడు. ఈ విజయంతో ప్రపంచ గ్రూప్ ప్లే ఆఫ్‌కు అర్హత పొందిన భారత్‌కు... సెప్టెంబర్‌లో జరిగే ప్లే ఆఫ్ మ్యాచ్‌లో అర్జెంటీనా, జర్మనీ, చెక్ రిపబ్లిక్, స్విట్జర్లాండ్, జపాన్, కెనడా, రష్యా, క్రొయేషియా జట్లలో ఒక జట్టు ప్రత్యర్థిగా ఉండనుంది. -
దివిజ్-పురవ్ జంటకు డబుల్స్ టైటిల్
పుణే: కేపీఐటీ-ఎమ్‌ఎస్‌ఎల్‌టీఏ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్లో దివిజ్ శరణ్-పురవ్ రాజా (భారత్) జోడీ టైటిల్ సాధించింది. శనివారం జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్లో దివిజ్-పురవ్ ద్వయం 3-6, 6-3, 11-9తో ‘సూపర్ టైబ్రేక్’లో లుకా మార్గరోలి (స్విట్జర్లాండ్)-హుగో నిస్ (ఫ్రాన్స) జంటపై విజయం సాధించింది. పురుషుల సింగిల్స్ విభాగంలో భారత ప్లేయర్ ప్రజ్ఞేష్ గుణేశ్వరన్ రన్నరప్‌గా నిలిచాడు. ఫైనల్లో ప్రజ్ఞేష్ 6-4, 4-6, 3-6తో సాడియో డుంబియా (ఫ్రాన్స) చేతిలో ఓడిపోయాడు. -
సింగిల్స్ ఫైనల్లో ప్రజ్ఞేష్
పుణే: కేపీఐటీ-ఎమ్‌ఎస్‌ఎల్‌టీఏ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్లో భారత యువతార ప్రజ్ఞేష్ గుణేశ్వరన్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో ప్రజ్ఞేష్ 6-2, 7-5తో డక్‌హీ లీ (దక్షిణ కొరియా)పై విజయం సాధించాడు. శనివారం జరిగే ఫైనల్లో సాడి యో డుంబియా (ఫ్రాన్స)తో ప్రజ్ఞేష్ తలపడతాడు. మరో సెమీఫైనల్లో డుంబియా 5-7, 6-3, 6-2తో నికోలా మిలోజెవిచ్ (సెర్బియా)పై గెలిచాడు.