
ఇంగ్లండ్‌దే నాలుగో వన్డే
హెడింగ్లీ: పాకిస్తాన్‌తో జరుగుతున్న ఐదు వన్డేల సిరీస్‌లో ఇంగ్లండ్ క్లీన్‌స్వీప్ దిశగా సాగుతోంది. గురువారం జరిగిన నాలుగో వన్డేలోనూ ఆతిథ్య జట్టు 4 వికెట్ల తేడాతో పాక్‌ను చిత్తు చేసింది. టాస్ నెగ్గి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పాక్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లకు 247 పరుగులు చేసింది. కెప్టెన్ అజహర్ అలీ (104 బంతుల్లో 80; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), ఇమాద్ వాసిమ్ (41 బంతుల్లో 57; 7 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలతో రాణించారు. రషీద్‌కు మూడు... మోయిన్ అలీ, జోర్డాన్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 48 ఓవర్లలో ఆరు వికెట్లకు 252 పరుగులు చేసి విజయం సాధించింది.
72 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయినా మిడిల్ ఆర్డర్‌లో స్టోక్స్ (70 బంతుల్లో 69; 6ఫోర్లు, 2 సిక్సర్లు), బెయిర్‌స్టో (83 బం తుల్లో 61; 4 ఫోర్లు, 1 సిక్స్), మోయిన్ అలీ (48 బంతుల్లో 45 నాటౌట్; 1 ఫోర్, 2 సిక్సర్లు) మెరుగ్గా ఆడి జట్టుకు విజయాన్ని అందించారు. ఇర్ఫాన్ రెండు వికెట్లు తీశాడు. దీంతో ఇంగ్లండ్ సిరీస్‌లో 4-0 ఆధిక్యానికి వచ్చింది. కార్డిఫ్‌లో ఆదివారం చివరిదైన ఐదో వన్డే జరుగుతుంది.