లండన్ : వరల్డ్ నంబర్‌వన్ జట్టు హోదాలో, సొంతగడ్డపై ప్రపంచకప్ ఫేవరెట్‌గా భారీ అంచనాలతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ తడబడుతుంది. గత మ్యాచ్‌లో అనూహ్యంగా శ్రీలంక చేతిలో ఓడిన మోర్గాన్ సేన తాజాగా చిరకాల ప్రత్యర్థి ఆస్ట్రేలియా చేతిలోనూ చావుదెబ్బతింది. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో సాధారణ లక్ష్యాన్ని ఛేదించలేక, కనీసం పూర్తి ఓవర్లు ఆడలేక చతికిల పడింది. ఒకరితో పోటీ పడి మరో బ్యాట్స్‌మన్ విఫలం కావడంతో టోర్నీలో మూడో ఓటమిని ఖాతాలో వేసుకొని సెమీస్ ఆశలను సంక్లిష్టం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఆ జట్టుపై సోషల్‌మీడియా వేదికగా విపరీతమైన ట్రోలింగ్ జరుగుతోంది. ఓడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్ చేజింగ్‌లోనే చేతులెత్తెయ్యడంపై మాజీ క్రికెటర్లు, అభిమానులు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇంగ్లండ్‌కు ఛేజింగ్ చేత కాదంటూ ఘాటుగా కామెంట్ చేస్తున్నారు. ఇంగ్లండ్ టైటిల్ రేసులో నిలవాలంటే తమ తదుపరి మ్యాచ్‌లు తప్పక గెలవాలి. అయితే ఆ జట్టు తమ తదుపరి మ్యాచ్‌లను భారత్, న్యూజిలాండ్‌తో ఆడాల్సి ఉంది. టోర్నీలో ఒటమెరగకుండా దూసుకుపోతున్న ఈ జట్లను ఇంగ్లండ్ ఢీకొట్టాలంటే ఆటగాళ్లు గట్టిగా శ్రమించాల్సిందేనని ఆ దేశ మాజీ క్రికెటర్లు, క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. (చదవండి : ఆసీస్ విలాసం ఇంగ్లండ్ విలాపం)
టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 285 పరుగులు చేసింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ కెప్టెన్ ఫించ్ (116 బంతుల్లో 100; 11 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీతో చెలరేగాడు. వార్నర్ (61 బంతుల్లో 53; 6 ఫోర్లు) మరోసారి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఇంగ్లండ్ 44.4 ఓవర్లలో 221 పరుగులకే ఆలౌటైంది. స్టోక్స్ (115 బంతుల్లో 89; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) మినహా అంతా విఫలమయ్యారు. బెహ్రన్‌డార్ఫ్ (5/44), మిషెల్ స్టార్క్ (4/43) ప్రత్యర్థిని కుప్పకూల్చారు. దీంతో ఆసీస్ 64 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇక గత మ్యాచ్‌లో శ్రీలంక నిర్ధేశించిన 233 పరుగుల లక్ష్యాన్ని చేధించలేక ఇంగ్లండ్ చతికిలపడింది. మలింగా దెబ్బకు 212 పరుగులకే కుప్పకూలింది. (చదవండి: లంక వీరంగం)
క్రికెట్ చరిత్రలోనే అదో అద్భుతం!
England Can’t Chase 🙈 #CWC19 #EngvAus
— Aakash Chopra (@cricketaakash) June 25, 2019
England were awful at Lord's today. Not sure what's going on but fear it is nerves/panic rather than lack of talent or form.
— Piers Morgan (@piersmorgan) June 25, 2019
Worried about the World Cup & even more worried about the Ashes... the Aussies will be like a pack of hunting dogs after this. @HomeOfCricket #ENGvAUS pic.twitter.com/BZ5GHoGSIE
Comments
Please login to add a commentAdd a comment