‘తోక’ చుక్కానిలా... | england got 477 runs in first innings | Sakshi
Sakshi News home page

‘తోక’ చుక్కానిలా...

Published Sun, Dec 18 2016 10:35 AM | Last Updated on Mon, Sep 4 2017 11:03 PM

‘తోక’ చుక్కానిలా...

‘తోక’ చుక్కానిలా...

ఇంగ్లండ్ లోయర్ ఆర్డర్ అద్భుత బ్యాటింగ్
 తొలి ఇన్నింగ్‌‌సలో 477 ఆలౌట్
 డాసన్, రషీద్ అర్ధ సెంచరీలు
 భారత్ దీటైన జవాబు
 తొలి ఇన్నింగ్‌‌సలో వికెట్ నష్టపోకుండా 60
 
 రెండో రోజు తొలి సెషన్‌లో భారత బౌలర్లు తమ ఆధిపత్యాన్ని చూపుతూ 37 పరుగుల వ్యవధిలోనే మూడు వికెట్లు తీశారు. అప్పటికి ఇంగ్లండ్ స్కోరు 321/7. ఇంకేముంది.. 400 కూడా కష్టమే అనుకున్న తరుణంలో వారి టెరుులెండర్లు అసాధారణ బ్యాటింగ్‌ను ప్రదర్శించారు. భారత బౌలర్ల సహనాన్ని పరీక్షిస్తూ... అరంగేట్ర టెస్టులోనే డాసన్ అదరగొట్టగా.. రషీద్ కూడా తన సహకారాన్ని అందించడంతో ఎనిమిదో వికెట్‌కు ఏకంగా 108 పరుగులు చేరి జట్టు భారీ స్కోరు సాధించగలిగింది. అయితే ఇంగ్లండ్ విసిరిన సవాల్‌కు భారత్ దీటైన సమాధానమిస్తోంది. ఓపెనర్లు రాహుల్, పార్థివ్ పటేల్ పర్యాటక బౌలర్లపై దూకుడును చూపిస్తూ వికెట్ నష్టపోకుండా రెండో రోజు తమ తొలి ఇన్నింగ్‌‌సను ముగించారు.
 
 చెన్నై: ఐదు టెస్టుల సిరీస్‌లో చివరి మ్యాచ్‌నైనా విజయంతో ముగించాలనే పట్టుదలతో ఉన్న ఇంగ్లండ్ జట్టుకు టెరుులెండర్లు భరోసానిచ్చారు. మిడిలార్డర్‌ను భారత బౌలర్లు త్వరగానే పెవిలి యన్‌కు చేర్చినా... చివర్లో లియాన్ డాసన్ (148 బంతుల్లో 66 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్), ఆదిల్ రషీద్ (155 బంతుల్లో 60, 8 ఫోర్లు) అత్యంత ఓపికతో అర్ధ సెంచరీలతో రాణించి ఆతిథ్య జట్టు సహనాన్ని పరీక్షించారు. ఈ ఇద్దరితోపాటు స్టువర్ట్ బ్రాడ్ (19), జాక్ బాల్ (12) కూడా రెండంకెల స్కోరు సాధించారు. ఫలితంగా శనివారం రెండో రోజు ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్‌‌సలో 157.2 ఓవర్లలో 477 పరుగులకు ఆలౌటైంది. మొయిన్ అలీ (262 బంతుల్లో 146; 13 ఫోర్లు, 1 సిక్స్) తన ఓవర్‌నైట్ స్కోరుకు మరో 26 పరుగులు మాత్రమే జత చేశాడు. ఇంగ్లండ్ చివరి మూడు వికెట్ల మధ్య 156 పరుగులు రావడం విశేషం. జడేజాకు మూడు వికెట్లు లభించగా... ఉమేశ్ యాదవ్, ఇషాంత్ శర్మ రెండేసి వికెట్లు పడగొట్టారు. అశ్విన్, మిశ్రా చెరో వికెట్ తీశారు. అనంతరం తొలి ఇన్నింగ్‌‌స ప్రారంభించిన భారత జట్టు ఆట ముగిసే సమయానికి 20 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 60 పరుగులు చేసింది. క్రీజులో లోకేశ్ రాహుల్ (68 బంతుల్లో 30 బ్యాటింగ్; 3 ఫోర్లు), పార్థివ్ పటేల్ (52 బంతుల్లో 28 బ్యాటింగ్; 2 ఫోర్లు) ఉన్నారు. మురళీ విజయ్ గాయం కారణంగా ఓపెనర్‌గా బరిలోకి దిగలేదు. ఇంగ్లండ్‌కన్నా ఇంకా 417 పరుగులు వెనకబడి ఉన్న భారత్ చేతిలో ఇంకా పది వికెట్లున్నాయి.

 స్కోరు వివరాలు

 ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్‌‌స: కుక్ (సి) కోహ్లి (బి) జడేజా 10; జెన్నింగ్‌‌స (సి) పార్థివ్ (బి) ఇషాంత్ 1; రూట్ (సి) పార్థివ్ (బి) జడేజా 88; మొయిన్ అలీ (సి) జడేజా (బి) ఉమేశ్ యాదవ్ 146; బెయిర్‌స్టో (సి) రాహుల్ (బి) జడేజా 49; స్టోక్స్ (సి) పార్థివ్ (బి) అశ్విన్ 6; బట్లర్ ఎల్బీడబ్ల్యూ (బి) ఇషాంత్ 5; డాసన్ నాటౌట్ 66; రషీద్ (సి) పార్థివ్ (బి) ఉమేశ్ యాదవ్ 60; బ్రాడ్ (రనౌట్) 19; బాల్ (బి) మిశ్రా 12; ఎక్స్‌ట్రాలు 15; మొత్తం (157.2 ఓవర్లలో ఆలౌట్) 477.

 వికెట్ల పతనం: 1-7, 2-21, 3-167, 4-253, 5-287, 6-300, 7-321, 8-429, 9-455, 10-477.
 బౌలింగ్: ఉమేశ్ యాదవ్ 21-3-73-2; ఇషాంత్ 21-6-42-2; జడేజా 45-9-106-3; అశ్విన్ 44-3-151-1; మిశ్రా 25.2-5-87-1; కరుణ్ నాయర్ 1-0-4-0.
 భారత్ తొలి ఇన్నింగ్‌‌స: రాహుల్ బ్యాటింగ్ 30; పార్థివ్ బ్యాటింగ్ 28; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (20 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా) 60.
 బౌలింగ్: బ్రాడ్ 5-2-6-0; బాల్ 3-0-9-0; మొయిన్ అలీ 7-1-18-0; స్టోక్స్ 2-0-12-0; రషీద్ 2-0-13-0; డాసన్ 1-1-0-0.
 
 
 సెషన్-1: భారత్‌దే ఆధిపత్యం

 ఓవర్‌నైట్ స్కోరు 284/4తో పటిష్టంగా కనిపించిన ఇంగ్లండ్‌ను తొలి సెషన్‌లో భారత బౌలర్లు ఇబ్బంది పెట్టారు. తొలి ఓవర్ ఐదో బంతికే బెన్ స్టోక్స్ (6)ను అశ్విన్ అవుట్ చేశాడు. ఈ సిరీస్‌లో అశ్విన్ అతడిని అవుట్ చేయడం ఇది ఐదోసారి కావడం విశేషం. ఆ తర్వాత కొద్దిసేపటికే బట్లర్ (5)ను ఇషాంత్ ఎల్బీగా పెవిలియన్‌కు చేర్చాడు. అశ్విన్ బౌలింగ్‌లో మొరుున్ అలీ ఓ సిక్స్, ఫోర్ బాది జోరును చూపాడు. అరుుతే డ్రింక్స్ విరామం తర్వాత ఉమేశ్ యాదవ్ ఓవర్‌లో జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఉమేశ్ వేసిన షార్ట్ పిచ్ బంతిని మొయిన్ అలీ పుల్ షాట్ ఆడాడు. అరుుతే టాప్ ఎడ్‌‌జ తీసుకున్న బంతి జడేజా చేతుల్లోకి వెళ్లింది. దీంతో 321 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోవడంతో ఆ జట్టు 350 పరుగులైనా చేస్తుందా అనే అనుమానం కలిగింది. అరుుతే జట్టును కాపాడే బాధ్యత డాసన్, ఆదిల్ రషీద్ తీసుకున్నారు. జాగ్రత్తగా ఆడుతూ వికెట్ పడకుండా లంచ్ విరామానికి వెళ్లారు.
 ఓవర్లు: 29, పరుగులు: 68, వికెట్లు 3
 
 సెషన్-2: శతక భాగస్వామ్యం
 లంచ్ అనంతరం డాసన్, రషీద్ జోడీ ఆచితూచి బ్యాటింగ్ చేశారు. ఇన్నింగ్‌‌సను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. చివరి మూడు వికెట్లను త్వరగా తీద్దామనుకున్న భారత బౌలర్లకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా చక్కటి బ్యాటింగ్‌తో ఈ ద్వయం ఆకట్టుకుంది. ఉమేశ్ యాదవ్ వేసిన ఓవర్‌లో రషీద్ వరుసగా రెండు ఫోర్లు బాది కాస్త జోరును పెంచాడు. ఇదే ఊపుతో 141 బంతుల్లో ఓ చక్కటి ఫోర్‌తో తన అర్ధ సెంచరీని పూర్తి చేశాడు. అరుుతే ఉమేశ్ వేసిన ఓవర్‌లో వైడ్ బంతిని ఆడబోరుున రషీద్ కీపర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాతి ఓవర్‌లోనే డాసన్ 148 బంతుల్లో కెరీర్‌లో తొలి అర్ధసెంచరీని పూర్తి చేశాడు.
 ఓవర్లు: 31, పరుగులు: 100, వికెట్లు: 1
 
 
 సెషన్-3: భారత్ దూకుడు
 టీ విరామానంతరం మూడో ఓవర్‌లోనే బ్రాడ్ రనౌట్‌గా వెనుదిరిగాడు. అశ్విన్ వేసిన ఇన్నింగ్‌‌స 157వ ఓవర్‌లో డాసన్ రెండు భారీ సిక్సర్లు బాది 17 పరుగులు రాబట్టాడు. ఆ తర్వాతి ఓవర్‌లోనే మిశ్రా.. బాల్ (18 బంతుల్లో 12; 1 సిక్స్)ను అవుట్ చేయడంతో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్‌‌స ముగిసింది. ఆ తర్వాత రాహుల్, పార్థివ్ పటేల్ భారత్ ఇన్నింగ్‌‌సను దీటుగా ఆరంభించారు. రెండో ఓవర్‌లో పార్థివ్  ఫోర్ బాదగా... అటు రాహుల్ చక్కటి స్ట్రొక్ ప్లేతో ఆకట్టుకున్నాడు. ఎక్కువగా సింగిల్స్ తీస్తూ వికెట్ పడకుండా రెండో రోజు ఆటను ముగించారు.
 ఓవర్లు: 6.2, పరుగులు: 25, వికెట్లు: 2 (ఇంగ్లండ్)
 ఓవర్లు: 20, పరుగులు: 60, వికెట్లు: 0 (భారత్)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement