విండీస్ విజయలక్ష్యం 156 | england set target of 156 against west indies | Sakshi
Sakshi News home page

విండీస్ విజయలక్ష్యం 156

Published Sun, Apr 3 2016 8:37 PM | Last Updated on Sun, Sep 3 2017 9:08 PM

విండీస్ విజయలక్ష్యం 156

విండీస్ విజయలక్ష్యం 156

కోల్కతా:వరల్డ్ టీ 20 భాగంగా వెస్టిండీస్తో జరుగుతున్న టైటిల్ పోరులో ఇంగ్లండ్ 156 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచిన విండీస్ తొలుత ఇంగ్లండ్ ను బ్యాటింగ్ ఆహ్వానించింది. దీంతో బ్యాటింగ్ చేపట్టిన ఇంగ్లండ్ స్కోరు బోర్డుపై పరుగులేమీ లేకుండానే జేసన్ రాయ్(0) వికెట్ ను కోల్పోయింది. అనంతరం అలెక్స్ హేల్స్(1), కెప్టెన్ ఇయాన్ మోర్గాన్(5) లు స్వల్ప వ్యవధిలో పెవిలియన్ కు చేరడంతో ఇంగ్లండ్  23 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

 

ఆ తరుణంలో జో రూట్(54;36 బంతుల్లో 7 ఫోర్లు), బట్లర్(36;22 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్సర్లు) జోడీ నిలకడగా ఆడి ఇంగ్లండ్ పరిస్థితిని చక్కదిద్దింది. ఈ జోడి నాల్గో వికెట్కు 61 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో ఇంగ్లండ్ తేరుకుంది. కాగా, బెన్ స్టోక్స్(13), మొయిన్ అలీ(0)లు తీవ్రంగా నిరాశపరచడంతో ఇంగ్లండ్ మరోసారి తడబడింది. ఇక చివర్లో విల్లే(21;14 బంతుల్లో 1 ఫోర్,2 సిక్సర్లు) బ్యాట్ ఝుళిపించడంతో పాటు, జోర్డాన్(12నాటౌట్) సమయోచితంగా ఆడటంతో ఇంగ్లండ్ నిర్ణీత ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 155 పరుగులు నమోదు చేసింది. విండీస్ బౌలర్లలో డ్వేన్ బ్రేవో,బ్రాత్ వైట్లు తలో మూడు వికెట్లు సాధించగా, బద్రికి రెండు, రస్సెల్కు ఒక వికెట్ దక్కింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement