లండన్ : ఇంగ్లండ్‌తో జరుగుతున్న చివరి టెస్ట్‌లో టీమిండియా పరాజయాం పాలైంది.118 పరుగుల తేడాతో ఇంగ్లండ్ విజయం సాధించింది. దీంతో ఐదు టెస్ట్‌ల సిరీస్‌ను ఇంగ్లీష్ జట్టు 4-1తో సొంతం చేసుకుంది. భారత బ్యాట్సమెన్స్‌లో కేఎల్ రాహుల్ (149), రిషబ్ పంత్ (114) వీరోచిత సెంచరీలతో పోరాడినా.. మిగతా వారంతా విఫలమవ్వడంతో ఓటమి తప్పలేదు. రెండు పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడ్డ టీమిండియాను రాహుల్, పంత్ ధ్వయం ఆదుకున్నారు.
వీరిద్దరు ఆరోవికెట్‌కు 204 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ఈ దశలో విజయం వైపు వెళ్తున్న ఈ జోడిని రషీద్ అవుడ్ చేయడంతో వీరి పోరాటానికి తెరపడింది. దీంతో తరువాత వచ్చిన వారు కూడా వెంటనే అవుట్ అవ్వడంతో ఇంగ్లండ్ విజయాన్ని అందుకుంది. ఇంగ్లండ్ బౌలర్లలో అండర్సన్ మూడు, రషీద్, కరన్ రెండేసి వికెట్లతో రాణించారు.
Comments
Please login to add a commentAdd a comment