ఎంజాయ్ చేస్తున్నా: విరాట్ కోహ్లీ | Enjoying my time away from cricket: Virat Kohli | Sakshi
Sakshi News home page

ఎంజాయ్ చేస్తున్నా: విరాట్ కోహ్లీ

Published Tue, Jun 7 2016 11:50 AM | Last Updated on Mon, Sep 4 2017 1:55 AM

ఎంజాయ్ చేస్తున్నా: విరాట్ కోహ్లీ

ఎంజాయ్ చేస్తున్నా: విరాట్ కోహ్లీ

ఇటీవల జరిగిన ఐపీఎల్ టోర్నీలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ తీరికలేకుండా గడిపాడు.

చెన్నై: ఇటీవల జరిగిన ఐపీఎల్ టోర్నీలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ తీరికలేకుండా గడిపాడు. ఐపీఎల్లోనే రికార్డు స్థాయిలో నాలుగు సెంచరీలు చేయడంతో పాటు అత్యధికంగా 973 పరుగులు సాధించాడు. ఐపీఎల్ ముగియడంతో విరాట్కు విశ్రాంతి లభించింది. జింబాబ్వే టూరుకు విరాట్ను ఎంపిక చేయకుండా సెలక్టర్లు విశ్రాంతినిచ్చారు. ఇక వెస్టిండీస్కు టూరుకు ఇంకా నెల విరామం ఉంది. దీంతో కోహ్లీ క్రికెట్కు దూరంగా ఉంటూ ఎంజాయ్ చేస్తున్నాడు. విదేశాలకు షూటింగ్కు వెళ్లిన గర్ల్ఫ్రెండ్ అనుష్క శర్మను విమానాశ్రయనికి తీసుకెళ్లి సెండాఫ్ ఇచ్చాడు. మధ్యలో తన ఫౌండేషన్ తరపున ఈవెంట్లలో పాల్గొంటూ డాన్స్లతో అదరగొట్టాడు. ఏఆర్ రెహ్మాన్ సంగీత దర్శకత్వంలో ఓ పాట కూడా పాడాడు. కోహ్లీ అసలు క్రికెట్ గురించే ఆలోచించడం లేదు. ఈ విషయాన్ని విరాటే చెప్పాడు.

'క్రికెట్కు దూరంగా విరామంలో లైఫ్ను ఎంజాయ్ చేస్తున్నా. ఆటకు దూరంగా ఉన్నందుకు కొన్నిసార్లు రిలీఫ్ అనిపిస్తోంది. నిజం చెప్పాలంటే జట్టు కూర్పు, ఇతర విషయాల గురించి అసలు ఆలోచించడం లేదు. వెస్టిండీస్ పరిస్థితులను గమనించి, అప్పుడు నలుగురు బౌలర్లతోనా లేక ఐదుమందితో బరిలోకి దిగాలా అనేది నిర్ణయిస్తాం' అని ఓ కార్యక్రమంలో విరాట్ చెప్పాడు.

ఇక ఏఆర్ రెహ్మాన్ సంగీతంలో పాటపాడటంపై కోహ్లీ మాట్లాడుతూ.. 'ఓ మ్యాచ్కు ఎలా సన్నద్ధం కావాలో తెలుసు. అయితే పాట పాడేందుకు ఎలా ప్రిపేర్ కావాలో తెలియదు. నేను మంచి గాయకుడినో కాదో నాకు తెలియదు. మొత్తానికి పాడగలిగాను. నాకు మాత్రం పాటపాడటం కంటే బ్యాటింగ్ ఎంతో ఈజీగా ఉంటుంది' అని అన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement