యుగేందర్‌కు రజతం | Eugener win a silver medal | Sakshi
Sakshi News home page

యుగేందర్‌కు రజతం

Published Fri, Nov 17 2017 12:53 AM | Last Updated on Fri, Nov 17 2017 12:53 AM

Eugener win a silver medal - Sakshi

ఏఎన్‌యూ (గుంటూరు): జాతీయ జూనియర్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ కుర్రాడు ఎస్‌. యుగేందర్‌ ఆకట్టుకున్నాడు. గురువారం ప్రారంభమైన ఈ పోటీల్లో ట్రయాథ్లాన్‌ ఈవెంట్‌లో రజత పతకాన్ని సాధించాడు. స్థానిక ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఐదు రోజుల పాటు జరుగనున్న ఈ మెగా ఈవెంట్‌ను అర్జున అవార్డు గ్రహీత పీటీ ఉష ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. అండర్‌–14 బాలుర ట్రయాథ్లాన్‌లో రెండో స్థానాన్ని దక్కించుకున్న యుగేందర్‌ 1739 పాయింట్లను సాధించాడు. ఈ ఈవెంట్‌లో ఢిల్లీకి శివాంగ్‌ మీనా 1779 పాయింట్లు స్కోర్‌ చేసి విజేతగా నిలిచాడు. హరియాణాకు చెందిన అజయ్‌ 1724 పాయింట్లతో కాంస్య పతకాన్ని దక్కించుకున్నాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement