డు ప్లెసిస్పై చర్యలు!
హోబార్ట్:ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో బాల్ టాంపరింగ్కు పాల్పడిన దక్షిణాఫ్రికా తాత్కాలిక కెప్టెన్ డు ప్లెసిస్పై చర్యలు తీసుకునేందుకు అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) నడుంబిగించింది. హోబార్ట్ లో జరిగిన టెస్టు నాల్గో రోజు ఆటలో డు ప్లెసిస్ బాల్ టాంపరింగ్ చేసినట్లు వీడియో ఫుటేజ్లో తేలడంతో అతనిపై చర్యలకు రంగం సిద్ధమైంది. డు ప్లెసిస్ బంతిని నోటితో కరిచినట్లు వీడియో ఫుటేజ్ లో వెల్లడైంది.
ఇది ఐసీసీ కోడ్లో లెవెల్ 2 నిబంధనను ఉల్లఘించినట్లే కావడంతో అతనిపై చర్యలు తీసుకోనుంది.ఇలా డు ప్లెసిస్ బాల్ టాంపరింగ్ పాల్పడటం రెండో సారి కాబట్టి ఆ క్రికెటర్ పై కనీసం ఒక మ్యాచ్ నిషేధం పడే అవకాశం ఉంది. అయితే డు ప్లెసిస్ మాత్రం తాను ఏ తప్పు చేయలేదని వాదిస్తున్నాడు. ఒకవేళ పొరపాటున ఏమైనా జరిగాలి తప్పా, కావాలని తప్పు చేయలేదని డు ప్లెసిస్ పేర్కొన్నాడు. మరొకవైపు హాషీమ్ ఆమ్లా మాత్రం డు ప్లెసిస్ టాంపరింగ్ కు పాల్పడటం ఒక జోక్ అంటూ కొట్టిపారేశాడు.