అరుణ్ జైట్లీ(ఫైల్‌ఫొటో)
ఢిల్లీ: ఇటీవల దివంగతులైన కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ స్మృతి చిహ్నంగా ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల మైదానం పేరును మార్చనున్నారు. ఈ మేరకు ఢిల్లీ, డిస్ట్రిక్ట్ అసోసియేషన్(డీడీసీఏ) మంగళవారం ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. కాగా, సెప్టెంబర్ 12న జరిగే కార్యక్రమంలో ఫిరోజ్‌షా కోట్లా స్టేడియాన్ని అరుణ్ జైట్లీ స్టేడియంగా పేరు మార్చనున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో పాటు కేంద్ర క్రీడా మంత్రి కిరణ్ రిజిజులు హాజరుకానున్నారు.
డీడీసీఏ అధ్యక్షుడిగా జైట్లీ సుదీర్ఘ కాలం(1999-2013) ఢిల్లీ క్రికెట్‌కు సేవలందించారు. దీనిలో భాగంగా డీడీసీఏ అధ్యక్షుడు రజత్ శర్మ మాట్లాడుతూ.. అరుణ్ జైట్లీ మద్దతు, ప్రోత్సాహంతోనే ఢిల్లీకి చెందిన పలువురు క్రికెటర్లు అంతర్జాతీయ స్థాయిలో విశేషమైన గుర్తింపు సాధించారన్నారు. జైట్లీ డీడీసీఏ పగ్గాలు చేపట్టిన సమయంలో అత్యాధునిక సౌకర్యాలతో స్టేడియంను పునరుద్ధరించారని, ప్రపంచ స్థాయి డ్రెస్సింగ్ రూమ్‌ల నిర్మించారన్నారు. డీడీసీఏకి జైట్లీ చేసిన సేవలు వెలకట్టలేనివని ఆయన పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment