Feroz Shah Kotla
-
అనుష్క భావోద్వేగం.. విరాట్‌పై ముద్దుల వర్షం
ఢిల్లీ: ఫిరోజ్ షా కోట్లాగా ఉన్న ఢిల్లీ మైదానానికి కొత్తగా అరుణ్ జైట్లీ స్టేడియంగా పేరు మార్చారు. అలాగే ఒక స్టాండ్‌కు విరాట్ కోహ్లి పెవిలియన్ అని పేరు పెట్టారు. ఈ రెండు కార్యక్రమాలు గురువారం నెహ్రూ స్టేడియంలోని వెయిట్‌లిఫ్టింగ్ హాల్లో జరిగాయి. గురువారం నాటి కార్యక్రమంలో భారత క్రికెట్ జట్టు సారథి విరాట్ కోహ్లి, బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ముందుగా ఈ కార్యక్రమానికి హాజరైన అతిరథులు ఇటీవల మరణించిన కేంద్ర మాజీ మంత్రి అరుణ్‌జైట్లీకి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఫిరోజ్ షా కోట్లా స్టేడియాన్ని అరుణ్ జైట్లీ స్టేడియంగా మారుస్తున్నట్టుగా డీడీసీఏ ప్రకటించింది. దీంతో కోట్లా మైదానం ఇకమీదట అరుణ్ జైట్లీ స్టేడియంగా కీర్తి గడించనుంది. కాగా క్రికెట్లో విశిష్ట సేవలందించినందుకుగానూ ఫిరోజ్ షా కోట్లా స్టేడియంలోని స్పెషల్ స్టాండ్‌కు విరాట్ కోహ్లిగా నామకరణం చేశారు. ఈ కార్యక్రమంలో డీడీసీఏ అధ్యక్షుడు రజత్ శర్మ మాట్లాడుతూ.. విరాట్.. తన తండ్రి చనిపోయిన తర్వాత కూడా దేశం కోసం ఆట ఆడటానికి సిద్ధమయ్యాడని.. అంతటి ధైర్యశాలి, గొప్ప మనిషి క్రికెట్ ప్రపంచంలో మరొకరు లేరని చెప్తూ అరుణ్ జైట్లీ అతన్ని కీర్తించేవారని పేర్కొన్నారు. దీంతో ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న విరూష్కలు భావోద్వేగానికి లోనయ్యారు. ఈ క్రమంలో అనుష్క ఉబికి వస్తున్న కన్నీరును దిగమింగుకుంటూ విరాట్ గొప్పతనానికి అతని చేతిపై ముద్దుల వర్షం కురిపించింది. కాసేపటి వరకు అనుష్క శర్మ సాధారణ స్థితికి రాలేకపోయింది. దీంతో విరాట్ తనని నవ్వించే ప్రయత్నం చేశారు. ఇక ఒకరిపై ఒకరు చూపించుకునే ప్రేమకు దిగులు కూడా దరి చేరకుండా పోయింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ హల్చల్ చేస్తోంది. (చదవండి: విరుష్కల ఫోటో వైరల్) View this post on Instagram Cute! @anushkasharma and @virat.kohli caught in an adorable moment during an event in Delhi. . . Follow for more Updates @filmymantramedia Inquiries @murtaza . . #bollywoodactress #Bollywood #viratkohli #anushkasharma #virushka #love #kiss #together #sports #bollywood #hollywood #game #cricket #filmymantramedia #filmymantra A post shared by Filmymantra Media (@filmymantramedia) on Sep 12, 2019 at 8:14pm PDT -
ఫిరోజ్ షా కాదు ఇక..
న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ స్మారకార్థం ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా మైదానానికి ‘అరుణ్ జైట్లీ స్టేడియం’అని అధికారికంగా నామకరణం చేశారు. గురువారం జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో జరిగిన నూతన నామకరణ మహోత్సవ కార్యక్రమానికి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అమిత్ షాతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు, టీమిండియా క్రికెటర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సారథి విరాట్ కోహ్లి అతడి సతీమణి అనుష్క శర్మలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ముందుగా ఈ కార్యక్రమానికి హాజరైన అతిరథులు అరుణ్ జైట్లీకి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం జైట్లీతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ఢిల్లీ డిస్ట్రిక్ క్రికెట్ అసోసియేషన్(డీడీసీఏ)కు అరుణ్ జైట్లీ సుదీర్ఘ కాలం అధ్యక్షుడిగా సేవలందించారు. డీడీసీఏతో పాటు బీసీసీఐలో పలు బాధ్యతలు, హోదాలను నిర్వహించారు. అయన అధ్యక్షుడిగా ఉన్న కాలంలోనే ఢిల్లీ క్రికెట్లో అనేక మార్పులు వచ్చాయి. దీంతో జైట్లీ మరణాంతరం ఆయన గుర్తుగా ఫిరోజ్ షా కోట్లా మైదానానికి జైట్లీ పేరు పెట్టాలని డీడీసీఏ నిర్ణయించింది. అయితే గ్రౌండ్‌కు మాత్రం పాత పేరునే కొనసాగించాలనే ఆలోచనలో ఉంది. కాగా, అరుణ్ జైట్లీ మద్దతు, ప్రోత్సాహంతోనే తాము ఈ స్థాయికి వచ్చామని వీరేంద్ర సెహ్వాగ్, గౌతమ్ గంభీర్, విరాట్ కోహ్లి, అశిష్ నెహ్రా వంటి క్రికెటర్లు బహిరంగంగా ప్రకటించిన విషయం తెలిసిందే. -
అరుణ్ జైట్లీ స్టేడియంగా ఫిరోజ్ షా..
ఢిల్లీ: ఇటీవల దివంగతులైన కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ స్మృతి చిహ్నంగా ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల మైదానం పేరును మార్చనున్నారు. ఈ మేరకు ఢిల్లీ, డిస్ట్రిక్ట్ అసోసియేషన్(డీడీసీఏ) మంగళవారం ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. కాగా, సెప్టెంబర్ 12న జరిగే కార్యక్రమంలో ఫిరోజ్‌షా కోట్లా స్టేడియాన్ని అరుణ్ జైట్లీ స్టేడియంగా పేరు మార్చనున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో పాటు కేంద్ర క్రీడా మంత్రి కిరణ్ రిజిజులు హాజరుకానున్నారు. డీడీసీఏ అధ్యక్షుడిగా జైట్లీ సుదీర్ఘ కాలం(1999-2013) ఢిల్లీ క్రికెట్‌కు సేవలందించారు. దీనిలో భాగంగా డీడీసీఏ అధ్యక్షుడు రజత్ శర్మ మాట్లాడుతూ.. అరుణ్ జైట్లీ మద్దతు, ప్రోత్సాహంతోనే ఢిల్లీకి చెందిన పలువురు క్రికెటర్లు అంతర్జాతీయ స్థాయిలో విశేషమైన గుర్తింపు సాధించారన్నారు. జైట్లీ డీడీసీఏ పగ్గాలు చేపట్టిన సమయంలో అత్యాధునిక సౌకర్యాలతో స్టేడియంను పునరుద్ధరించారని, ప్రపంచ స్థాయి డ్రెస్సింగ్ రూమ్‌ల నిర్మించారన్నారు. డీడీసీఏకి జైట్లీ చేసిన సేవలు వెలకట్టలేనివని ఆయన పేర్కొన్నారు. -
అంపైర్ తప్పుడు నిర్ణయం: గంభీర్ తిట్ల దండకం
ఢిల్లీ: మైదానంలో సీనియర్ క్రికెటర్ గౌతం గంభీర్ దురుసగా ప్రవర్తించడం మరోసారి చర్చనీయాంశమైంది. ఫీల్డ్ అంపైర్ తప్పుడు నిర్ణయాన్ని ప్రకటించడంతో గంభీర్ దుర్భాషలాడుతూ మైదానాన్ని వీడాడు. రంజీ ట్రోఫీలో భాగంగా ఫిరోజ్ షా కోట్ల మైదానంలో హిమాచల్ ప్రదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో గంభీర్ తన సహనాన్ని కోల్పోయాడు. సోమవారం ఢిల్లీ తొలి ఇన్నింగ్స్‌లో భాగంగా గంభీర్(44) తొలి వికెట్‌గా వెనుదిరిగాడు. అయితే గంభీర్ ఔటై పెవిలియన్‌కు చేరే క్రమంలో అంపైర్ వైపు చూస్తూ తిట్ల దండకాన్ని అందుకున్నాడు. హిమచల్ ప్రదేశ్ బౌలర్ డాగర్ ఇన్నింగ్స్ 17 ఓవర్ తొలి బంతిని మిడిల్ స్టంప్‌పైకి సంధించాడు. ఆ బంతిని ఆడే క్రమంలో గంభీర్ తన ప్యాడ్లను అడ్డుపెట్టి కాపాడుకునే యత్నం చేశాడు. అయితే ప్యాడ్లను తాకిన బంతి షార్ట్ లెగ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న ప్రియాన్షు చేతిలో పడింది. దాంతో వారు అప్పీల్‌కు వెళ్లడం, దాన్ని అంపైర్ ఔట్‌గా ప్రకటించడం జరిగిపోయాయి. అంపైర్ నిర్ణయంతో ఆశ్చర్యపోయిన గంభీర్ వెంటనే తన నోటికి పని చెప్పాడు. అంపైర్ వైపు చిరాకుగా చూస్తూ తిట్టుకుంటూ పెవిలియన్‌కు చేరాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. -
అంపైర్ తప్పుడు నిర్ణయాన్ని ప్రకటించడంతో ..
-
పాక్‌పై కుంబ్లే పంజా.. మరుపురాని ఘట్టానికి 19ఏళ్లు
ప్రపంచ క్రికెట్ చరిత్రలో సంచలనం జరిగిన రోజు అది. భారత్ చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను కసితీరా ఓడించిన రోజు. భారత మాజీ స్పిన్నర్ కుంబ్లే జీవితంలో మరిచిపోలేని రోజు. తన స్పిన్‌తో దాయాది దేశాన్ని చాపచుట్టేసినట్లు చుట్టేశాడు. క్రికెట్ అభిమానులకు మరిచిపోలేని బహుమతి ఇచ్చాడు. ఆ మరుపురాని ఘటనకు నేటితో 19ఏళ్లు నిండాయి. అది ఫిబ్రవరి 7,1999 దాయాది పాకిస్తాన్‌తో టెస్టు మ్యాచ్, ఢిల్లీ, ఫిరోజ్‌షా కోట్ల స్టేడియం. పాకిస్తాన్ ముందు 420 కొండంత లక్ష్యం, ఒక్కరోజు మాత్రమే మిగిలింది. చివరి రోజు 101 పరుగలకు 1వికెట్ నష్టంతో పాకిస్తాన్ డ్రా కోసం ఆడుతోంది. అప్పుడే రంగంలోకి దిగాడు అనిల్ కుంబ్లే. గింగిరాలు తిరిగే బంతితో పాక్‌ను ముప్పుతిప్పలు పెట్టాడు. సయీద్ అన్వర్, షాహిద్ ఆప్రీదిలు కొద్ది సేపు నిలువరించినా చివరికి లొంగక తప్పలేదు. అంతే కుంబ్లే విసిరే స్పిన్‌ను ఎదుర్కొనలేని పాక్ ఆటగాళ్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఈ మ్యాచ్‌లో కుంబ్లే పదికి పది వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రపంచంలో పది వికెట్లు తీసిన రెండో ఆటగాడిగా రికార్డుకెక్కాడు. ఇంగ్లండ్‌కు చెందిన జిమ్ లాకెర్ 1956లో ఆస్ట్రేలియాతో జరిగిన 4వటెస్టు మ్యాచ్‌లో పదివికెట్లు తీశాడు. ఆయన తర్వాత ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు తీసిన ఆటగాడు అనిల్ కుంబ్లేనే. ఈ మ్యాచ్‌లో కుంబ్లే 26.3 ఓవర్లు బౌలింగ్ చేయగా ఇందులో 9ఓవర్లు మెయిడెన్లు ఉన్నాయి. 74 పరుగులు ఇచ్చి 10వికెట్లు తీసి పాకిస్తాన్ వెన్నువిరిచాడు. ఈ మ్యాచ్‌లో 207 పరుగులకు పాక్ ఆలౌట్ అయింది. భారత్ 212 పరుగులతో భారీ విజయం సాధించింది. ఈ అద్భుత విజయానికి నేటితో 19ఏళ్లు నిండాయి. -
భారత్ తో తొలి టీ20: టాస్ నెగ్గిన కివీస్
న్యూఢిల్లీ: భారత్ తో ఇక్కడ జరగనున్న తొలి టీ20లో టాస్ నెగ్గిన న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఛేజింగ్ కు అనుకూలించే ఫిరోజ్ షా కోట్ల స్టేడియంలో తొలి టీ20లో టాస్ కీలకమన్న విషయం తెలిసిందే. టాస్ గెలిస్తే భారత్ కూడా ఛేజింగ్ వైపే మొగ్గుచూపేది. అసలే ట్వంటీ20లో టీమిండియా నెగ్గని పటిష్ట జట్టు కివీస్. భారత ఓపెనర్లుగా రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ క్రీజులోకి వచ్చారు. ఇప్పుడు న్యూజిలాండ్‌తో టి20ల్లో మాత్రం భారత్‌కు సవాల్ ఎదురుగా నిలిచింది. ప్రత్యర్థిపై మన గత రికార్డు ప్రతికూలంగా ఉండగా, తాజా ఫామ్ కూడా కివీస్‌కే అనుకూలంగా ఉంది. ఈ నేపథ్యంలో నేడు (బుధవారం) ఫిరోజ్ షా కోట్ల స్టేడియంలో జరిగే తొలి టి20లో ఇరు జట్లు తలపడుతున్నాయి. గతంలో ఒక్క మ్యాచ్ లోనూ కివీస్ పై నెగ్గిన చరిత్ర లేని టీమిండియా.. నేటి మ్యాచ్ లోనైనా నెగ్గి వెటరన్ పేసర్ ఆశిష్ నెహ్రాకు ఘనంగా వీడ్కోలు పలకాలని కోహ్లీసేన భావిస్తోంది. తుది జట్లు భారత్: కోహ్లి (కెప్టెన్), ధావన్, రోహిత్ శర్మ, శ్రేయస్ అయ్యర్, ధోని, పాండ్యా, అక్షర్ పటేల్, భువనేశ్వర్, బుమ్రా, ఆశిష్ నెహ్రా, చహల్ న్యూజిలాండ్: కేన్ విలియమ్సన్ (కెప్టెన్), గప్టిల్, మున్రో, టామ్ బ్రూస్, లాథమ్, నికోల్స్, గ్రాండ్‌హోమ్, సాన్‌ట్నర్, బౌల్ట్, సౌతీ, ఇష్ సోధి. -
ఢిల్లీలో 'తిప్పేశారు'
తొలి వన్డేలో ఓటమి... రెండో వన్డేలో కనీసం 300 చేసే అవకాశాన్ని చేజేతులా వదులుకున్నారు... అటు ప్రత్యర్థి వెస్టిండీస్ లక్ష్య ఛేదనలో దూసుకుపోతోంది... ఇక భారత్ ఓటమి ఖాయం. సిరీస్ కూడా చేజారినట్లే... ఇలాంటి స్థితిలో భారత బౌలర్లు అద్భుతం చేశారు. పోరాడితే ఫలితాన్ని తారుమారు చేయొచ్చని నిరూపిస్తూ జట్టుకు అద్భుత విజయాన్నందించారు. దీంతో ఢిల్లీలో జరిగిన రెండో వన్డేలో ధోని సేన వెస్టిండీస్‌ను ఓడించి ఐదు వన్డేల సిరీస్‌ను 1-1తో సమం చేసింది. న్యూఢిల్లీ: వెస్టిండీస్ లక్ష్యం 264 పరుగులు... స్కోరు 170/2... స్మిత్ సెంచరీకి చేరువయ్యాడు... జట్టులో ఎనిమిదో నంబర్ వరకు స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్. ఇలాంటి స్థితిలో భారత్ మ్యాచ్ గెలుస్తుందనే ఆశ సగటు క్రికెట్ అభిమానికి లేదు. కానీ బౌలర్లు మ్యాజిక్ చేశారు. మంచు కారణంగా స్పిన్నర్లకు బంతిపై పట్టు దొరకని పరిస్థితుల్లోనూ ప్రత్యర్థిని కట్టడి చేయగలిగారు. ఓవరాల్‌గా షమీ, జడేజా, మిశ్రా కలిసి... ఓడిపోతుందనుకున్న మ్యాచ్‌ను గట్టెక్కించారు. ఫిరోజ్ షా కోట్ల మైదానంలో శనివారం జరిగిన రెండో వన్డేలో భారత్ 48 పరుగుల తేడాతో వెస్టిండీస్‌ను ఓడించింది. టాస్ నెగ్గి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు 50 ఓవర్లలో 7 వికెట్లకు 263 పరుగులు సాధించింది. చాలా రోజుల తర్వాత విరాట్ కోహ్లి (78 బంతుల్లో 62; 5 ఫోర్లు) బ్యాట్‌ను ఝుళిపించగా.. సురేశ్ రైనా (60 బంతుల్లో 62; 5 ఫోర్లు; 2 సిక్సర్లు), కెప్టెన్ ధోని (40 బంతుల్లో 51 నాటౌట్; 5 ఫోర్లు; 1 సిక్స్) కూడా అర్ధ సెంచరీలతో చెలరేగారు. టేలర్‌కు మూడు వికెట్లు పడ్డాయి. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన విండీస్ 46.3 ఓవర్లలో 215 పరుగులకు ఆలౌటయ్యింది. డ్వేన్ స్మిత్ (97 బంతుల్లో 97 పరుగులు; 11 ఫోర్లు; 2 సిక్సర్లు) ఒంటరి పోరాటం చేశాడు. పొలార్డ్ (50 బంతుల్లో 40; 1 ఫోర్; 3 సిక్సర్లు) మోస్తరుగా ఆడాడు. షమీకి నాలుగు వికెట్లు, జడేజాకు మూడు, మిశ్రాకు రెండు వికెట్లు దక్కాయి. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ షమీకి దక్కింది. మూడో వన్డే మంగళవారం విశాఖపట్నంలో జరగాల్సి ఉంది. మెరిసిన కోహ్లి ఆరంభంలో విండీస్ పేసర్లు చెలరేగడంతో ఓపెనర్లు ధావన్ (1), రహానే (12)లు పరుగులు చేసేందుకు ఇబ్బంది పడ్డారు. వన్‌డౌన్‌లో అంబటి రాయుడు (54 బంతుల్లో 32; 3 ఫోర్లు) ఆకట్టుకునే ప్రయత్నం చేసినా ఎక్కువసేపు నిలబడలేకపోయాడు. దీంతో భారత్ 20 ఓవర్లలోపే 74 పరుగులకు 3 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో కోహ్లి, రైనాలు అద్భుతంగా ఆడారు. 14 పరుగుల వద్ద అవుటయ్యే ప్రమాదం నుంచి బయటపడ్డ రైనా... బెన్, రాంపాల్ బౌలింగ్‌లో రెండు అద్భుతమైన సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. కానీ రెండో ఎండ్‌లో కోహ్లి నెమ్మదిగా ఆడటంతో రన్‌రేట్ మందగించింది. నాలుగో వికెట్‌కు 105 పరుగులు జోడించాక వీరిద్దరు స్వల్ప వ్యవధిలో అవుటయ్యారు. చివర్లో వచ్చిన ధోని వేగంగా ఆడాడు. జడేజా (6) తొందరగా అవుటైనా... భువనేశ్వర్ (14 బంతుల్లో 18; 1 ఫోర్)తో కలిసి చకచకా పరుగులు రాబట్టాడు. చివరి 15 ఓవర్లలో 100 పరుగులు రావడంతో భారత్ గౌరవప్రదమైన స్కోరు చేసింది. స్మిత్ ఒంటరిపోరు తొలి వికెట్‌కు 64 పరుగులు జోడించిన అనంతరం డారెన్ బ్రేవో (44 బంతుల్లో 26; 2 ఫోర్లు) వెనుదిరగ్గా డ్వేన్ స్మిత్ చెలరేగాడు. ఆరంభంలో నెమ్మదిగానే ఆడినా పొలార్డ్ నుంచి సహకారం అందడంతో జోరు పెంచాడు. 57 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అటు పొలార్డ్ సిక్సర్లతో దూకుడు ప్రదర్శించినా మిశ్రా బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. కోహ్లి వేసిన ఓవర్లో మూడు ఫోర్లు కొట్టిన స్మిత్.. సెంచరీకి చేరువవుతున్న తరుణంలో షమీ వేసిన బంతి ప్యాడ్లను తాకుతూ వికెట్లను ముద్దాడింది. దీంతో విండీస్ తరఫున కీలక ఇన్నింగ్స్ ముగిసినట్టయ్యింది. 189/4 దగ్గర బంతిని మార్చగా అప్పటికి విండీస్ 59 బంతుల్లో 75 పరుగులు చేస్తే చాలు. అయితే బంతిని మార్చిన వెంటనే అమిత్ మిశ్రా రామ్‌దిన్ (3) వికెట్ పడగొట్టాడు. ఆ మరుసటి ఓవర్లో జడేజా రెండు వికెట్లు తీయడంతో ఇక కోలుకోలేకపోయింది. 26 పరుగుల వ్యవధిలోనే చివరి ఐదు వికెట్లు నేలకూలడంతో విండీస్ ఓటమి ఖాయమైంది. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: రహానే (సి) డ్వేన్ బ్రేవో (బి) స్యామీ 12; ధావన్ (బి) టేలర్ 1; రాయుడు (సి) స్యామీ (బి) బెన్ 32; కోహ్లి (సి) శామ్యూల్స్ (బి) రాంపాల్ 62; రైనా (సి) పొలార్డ్ (బి) టేలర్ 62; ధోని నాటౌట్ 51; జడేజా (బి) టేలర్ 6; భువనేశ్వర్ (సి) పొలార్డ్ (బి) డ్వేన్ బ్రేవో 18; షమీ నాటౌట్ 1; ఎక్స్‌ట్రాలు: 18; మొత్తం: (50 ఓవర్లలో 7 వికెట్లకు) 263. వికెట్ల పతనం: 1-4; 2-50; 3-74; 4-179; 5-196; 6-219; 7-248. బౌలింగ్: రాంపాల్ 8-0-47-1; టేలర్ 10-0-54-3; బెన్ 10-0-47-1; డ్వేన్ బ్రేవో 8-0-51-1; స్యామీ 4-0-14-1; శామ్యూల్స్ 5-1-21-0; రస్సెల్ 3-0-14-0; పొలార్డ్ 2-0-10-0 వెస్టిండీస్ ఇన్నింగ్స్: స్మిత్ (బి) షమీ 97; డారెన్ బ్రేవో (బి) షమీ 26; పొలార్డ్ (బి) మిశ్రా 40; శామ్యూల్స్ (సి) కోహ్లి (బి) ఉమేశ్ యాదవ్ 16; రామ్‌దిన్ (సి) రైనా (బి) మిశ్రా 3; డ్వేన్ బ్రేవో (సి) ధావన్ (బి) షమీ 10; రస్సెల్ (స్లంప్డ్) ధోని (బి) జడేజా 4; స్యామీ (బి) జడేజా 1; రాంపాల్ (సి అండ్ బి) షమీ 16; టేలర్ (సి) భువనేశ్వర్ (బి) జడేజా 0; బెన్ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (46.3 ఓవర్లలో ఆలౌట్) 215. వికెట్ల పతనం: 1-64; 2-136; 3-170; 4-183; 5-189; 6-195; 7-199; 8-199; 9-201; 10-215. బౌలింగ్: భువనేశ్వర్ 7-0-32-0; ఉమేశ్ 9-0-42-1; షమీ 9.3-0-36-4; జడేజా 9-0-44-3; మిశ్రా 10-2-40-2; కోహ్లి 2-0-20-0.