ఆసియాకప్‌: శ్రీలంకకు ఎదురుదెబ‍్బ | Finger injury rules Chandimal out of Asia Cup | Sakshi
Sakshi News home page

ఆసియాకప్‌: శ్రీలంకకు ఎదురుదెబ‍్బ

Published Tue, Sep 11 2018 1:00 PM | Last Updated on Fri, Nov 9 2018 6:46 PM

Finger injury rules Chandimal out of Asia Cup - Sakshi

కొలంబో: ఆసియా కప్ ప్రారంభానికి ముందే శ్రీలంక జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. లంక టెస్టు కెప్టెన్‌ దినేశ్ చండిమాల్‌ ఆసియా కప్‌కు దూరం కానున్నాడు. ఈ మేరకు ఆ దేశ క్రికెట్‌ బోర్డు అధికారిక ప్రకటన చేసింది. దేశవాళీ టోర్నీలో వేలికి అయిన గాయం నుంచి ఇంకా చండిమాల్‌ పూర్తిగా కోలుకోలేకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ దేశ క్రికెట్‌ బోర్డు తెలిపింది. దాంతో అతడి స్థానంలో నిరోషన్‌ డిక్వెలా చోటు దక్కించుకున్నాడు.

ఆసియా కప్‌లో దినేశ్ చండీమాల్ లేకపోవడం ఆ జట్టుకు పెద్ద దెబ్బేనని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. శ్రీలంక తరుపున చండిమాల్ ఇప్పటివరకు 32.69 యావరేజితో 3000కుపైగా పరుగులు చేశాడు. కాగా, ఇటీవల వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో బాల్‌ ట్యాంపరింగ్‌ ఆరోపణలతో చండిమాల్‌పై ఆరు మ్యాచ్‌ల నిషేధం పడిన సంగతి తెలిసిందే. దాంతో స‍్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్‌లో చండిమాల్‌ చోటు కోల్పోయాడు. అయితే ఆసియాకప్‌లో పాల్గొనే జట్టులో చండిమాల్‌కు స్థానం కల్పించినప్పటికీ, చివరి నిమిషంలో గాయం కారణంగా అతనికి మరింత విశ్రాంతి అవసరమని ఆ జట్టు మెడికల్‌ టీమ్‌ తేల్చిచెప్పింది. దాంతో ఆసియాకప్‌కు చండిమాల్‌ దూరం కాగా, స్టాండ్‌ బైగా ఉన్న డిక్వెల్లా 16 మంది సభ్యులతో కూడిన బృందంలో చోటు దక్కింది. ఈ నెల 15వ తేదీ నుంచి యూఏఈ వేదికగా ఆసియాకప్‌ ప్రారంభం కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement