స్కేటింగ్‌లో మెరిసిన చైతన్య | Flanders Grand Prix International skating in chetanya | Sakshi
Sakshi News home page

స్కేటింగ్‌లో మెరిసిన చైతన్య

Published Thu, Aug 21 2014 2:29 AM | Last Updated on Sat, Sep 2 2017 12:10 PM

స్కేటింగ్‌లో మెరిసిన చైతన్య

స్కేటింగ్‌లో మెరిసిన చైతన్య

శేరిలింగంపల్లి: ఫ్లాండర్స్ గ్రాండ్ ప్రి ఇంటర్నేషనల్ రోలర్ స్పీడ్ స్కేటింగ్‌లో నగరానికి చెందిన చైతన్య కుమార్ మెరిశాడు. బెల్జియంలోని ఆస్టెండ్‌లో ఇటీవల జరిగిన ఈ పోటీల్లో బీహెచ్‌ఈఎల్ స్కేటర్ చైతన్య స్వర్ణ, రజత పతకాలు గెలిచాడు. మరో భారత స్కేటర్ మిహిర్ హిందుధర్ ఈ పోటీల్లో రెండు రజతాలు, ఒక కాంస్యం చేజిక్కించుకున్నాడు. రోలర్ స్కేటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా తరఫున పాల్గొన్న వీరిద్దరు పతకాలు సాధించడం పట్ల భారత కోచ్ విఠలా ఉప్పలూరి సంతోషం వ్యక్తం చేశారు. ఈ చాంపియన్‌షిప్‌లో 22 దేశాలకు చెందిన 500 మందికి పైగా స్కేటర్లు పాల్గొన్నారని ఆయన వివరించారు. నగరానికి చెందిన మరో కుర్రాడు శశాంక్ రాయ్ 17వ స్థానంలో నిలిచాడు. ఓవరాల్ ర్యాంకింగ్స్‌లో మిహిర్ మూడో స్థానంలో నిలవగా, యూరోపియన్ చాలెంజ్ షార్ట్ డిస్టెన్స్ ఈవెంట్‌లో చైతన్య కుమార్ ప్రథమ స్థానం పొందాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement