అక్తర్‌ కెరీర్‌ దాల్మియా చలవే! | Former ICC chief Jagmohan Dalmiya saved Shoaib Akhtar career In 1999 | Sakshi
Sakshi News home page

అక్తర్‌ కెరీర్‌ దాల్మియా చలవే!

Published Fri, Apr 17 2020 12:18 AM | Last Updated on Fri, Apr 17 2020 12:18 AM

Former ICC chief Jagmohan Dalmiya saved Shoaib Akhtar career In 1999 - Sakshi

షోయబ్‌ అక్తర్

కరాచీ: భారత దివంగత క్రికెట్‌ పాలకుడు జగ్మోహన్‌ దాల్మియా ఇచ్చిన సహకారంతోనే  పాకిస్తాన్‌ మాజీ స్పీడ్‌స్టర్‌ షోయబ్‌ అక్తర్‌ కెరీర్‌ కొనసాగిందని పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) మాజీ అధ్యక్షుడు తౌకీర్‌ జియా వ్యాఖ్యానించారు.  దాల్మియా 1997 నుంచి 2000 వరకు ఐసీసీ అధ్యక్షుడిగా పనిచేశారు. 1999లో అక్తర్‌ బౌలింగ్‌ యాక్షన్‌ సందేహాస్పదంగా ఉందని విమర్శలు రావడంతో ఐసీసీ కన్నేసింది. ‘ఐసీసీ సభ్యులంతా అక్తర్‌ బౌలింగ్‌ యాక్షన్‌పై అభ్యంతరం వ్యక్తం చేసినా... దాల్మియా మాకు మద్దతుగా నిలిచారు. ఐసీసీలో అయనకున్న పలుకుబడి దృష్ట్యా మిగతా సభ్యుల అభ్యంతరాలన్నీ వీగిపోయాయి. జన్మతః వచ్చిన సమస్య వల్లే అలాంటి యాక్షన్‌తో అక్తర్‌ బౌలింగ్‌ చేస్తున్నట్లు నమ్మబలకడంతో ఆ వివాదం అంతటితో ముగిసింది’ అని జియా తెలిపారు.  

రూ. 690 కోట్ల నష్టం...
గత ఐదేళ్ల కాలంలో భారత్‌తో సిరీస్‌ ఆడకపోవ డంతో పీసీబీ కు వచ్చిన అక్షరాలా రూ.690 కోట్ల నష్టం వచ్చింది. భారత్‌తో ఆడితేనే పూర్తి మొత్తం ఇస్తామని లేదంటే కోత తప్పదని ప్రసారకర్తలతో జరిగిన ఒప్పందంలో స్పష్టంగా వుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement