ఫస్ట్ క్లాస్ క్రికెట్ కు ఆకాశ్ చోప్రా వీడ్కోలు
న్యూఢిల్లీ: టీమిండియా మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా ఫస్ట్ క్లాస్ క్రికెట్ నుంచి వీడ్కోలు తీసుకున్నాడు. ఈ మేరకు శుక్రవారం ఆకాశ్ చోప్రా ఓ ప్రకటనలో పేర్కొన్నాడు. 15 ఏళ్ల క్రికెట్ జీవితానికి తాజాగా వీడ్కోలు చెప్పిన ఆ క్రికెటర్ తన కెరీర్ లో 10 టెస్ట్ మ్యాచ్ లు ఆడాడు. అతని టెస్ట్ మ్యాచ్ కెరీర్ లో 23 సగటుతో 437 పరుగులు చేశాడు.
ఇందులో న్యూజిలాండ్ పై రెండు హాఫ్ సెంచరీలను నమోదు చేశాడు. 2003-04 వరకూ భారత్ కు ప్రాతినిధ్యం వహించిన ఆకాశ్ అన్ని ఫార్మెట్ల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించాడు.