యువరాజ్ మెరుపులు
లాహ్లి: భారత స్టార్ క్రికెటర్ యువరాజ్ సింగ్ 13 మ్యాచ్‌ల తర్వాత ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో రాణించాడు. మధ్యప్రదేశ్‌తో జరుగుతున్న రంజీ మ్యాచ్‌లో యువరాజ్ (241 బంతుల్లో 164 బ్యాటింగ్; 24 ఫోర్లు) సెంచరీతో రాణించడంతో... తొలి రోజు పంజాబ్ 89 ఓవర్లలో మూడు వికెట్లకు 347 పరుగులు చేసింది. గురుకీరత్ సింగ్ (102 బంతుల్లో 101 బ్యాటింగ్; 16 ఫోర్లు, 1 సిక్సర్) కూడా సెంచరీ చేశాడు.
చత్తీస్‌గఢ్ 261/4
కళ్యాణి: ఆంధ్ర బౌలర్లు మరోసారి తడబడటంతో గ్రూప్ సి రంజీ మ్యాచ్‌లో చత్తీస్‌గఢ్ నిలకడగా ఆడుతోంది. తొలి రోజు ఆట ముగిసేసమయానికి చత్తీస్‌గఢ్ 90 ఓవర్లలో నాలుగు వికెట్లకు 261 పరుగులు చేసింది. ఖారే (136 బ్యాటింగ్) అజేయ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఆంధ్ర బౌలర్లలో స్టీఫెన్ 2, శివకుమార్, అయ్యప్ప ఒక్కో వికెట్ తీశారు.
హైదరాబాద్ 191 ఆలౌట్
జంషెడ్‌పూర్: హరియాణతో జరుగుతున్న గ్రూప్ సి మ్యాచ్‌లో హైదరాబాద్ తొలి రోజు 82.5 ఓవర్లలో 191 పరుగులకు ఆలౌటరుుంది. సందీప్ (44), సుమంత్ (35) మినహా అందరూ విఫలమయ్యారు. హరియాణా స్పిన్నర్ చహల్ ఆరు వికెట్లతో రాణించాడు.