కోల్ కతా: ట్వంటీ 20 ఫార్మాట్ నుంచి ఎంఎస్ ధోని వీడ్కోలు తీసుకునే సమయం ఆసన్నమైందంటూ ఇటీవల విమర్శలు వెలుగు చూసిన నేపథ్యంలో భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ స్పందించాడు. పొట్టి ఫార్మాట్ లో ధోని గేర్ మార్చాలంటూ సలహా ఇచ్చాడు. 'ఇక టీ 20ల్లో ధోని భిన్నమైన శైలిలో ఆడాలి. ఈ విషయంపై జట్టు మేనేజ్ మెంట్, కెప్టెన్ విరాట్ కోహ్లిలు ప్రత్యేకంగా ధోనితో మాట్లాడాలి. ధోనిలో సామర్థ్యానికి కొదవలేదు. కాకపోతే టీ 20ల్లో భిన్నంగా బ్యాటింగ్ చేస్తేనే ధోని కచ్చితంగా సక్సెస్ అవుతాడు. ధోని వన్డే రికార్డు పరంగా చూస్తే టీ 20 రికార్డు బాలేదు. దాంతో ఈ ఫార్మాట్ ధోని దూకుడు పెంచాలి. ఇక్కడ స్వేచ్ఛగా ఆడటానికి ధోని యత్నించాలి. అందుకు సెలక్టర్లకు కూడా సహకరించాలి. ధోని ఆడటానికి స్వేచ్చాయుత వాతావరణం కల్పిస్తే మరొ కొత్త ధోనిని చూస్తాం' అని గంగూలీ విజ్ఞప్తి చేశాడు.
ఇదిలా ఉంచితే, శ్రీలంకతో టెస్టు సిరీస్ కు హార్దిక్ పాండ్యాకు విశ్రాంతి కల్పించడంపై గంగూలీ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. 'హార్దిక్ ను రాబోవు టెస్టు సిరీస్ కు పక్కకు పెట్టడం ఆశ్చర్యం కల్గించింది. అతను గాయం కారణంగా జట్టుకు దూరమైనట్లేతే అది నాకు తెలీదు. అతను కేవలం మూడు టెస్టులు మాత్రమే ఆడాడు. టెస్టు క్రికెట్ ఆడటానికి అతనికి ఇదే సరైన వయసు. హార్దిక్ కు విశ్రాంతినివ్వడానికి సరైన కారణం ఏమిటి అనేది నాకు తెలీదు. త్వరలోనే అతను ఫిట్ అవుతాడని ఆశిస్తున్నా'అని గంగూలీ పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment