సాక్షి, స్పోర్ట్స్: దూకుడుకు మారుపేరైన విరాట్ కోహ్లి నేతృత్వంలో టీమిండియా వరుస సిరీస్ విజయాలు సొంతం చేసుకుంది. ఐసీసీ తాజాగా ప్రకటించిన ర్యాంకింగ్స్ ప్రకారం టెస్టుల్లో, వన్డేల్లో భారత క్రికెట్ జట్టు అగ్రస్థానంలో కొనసాగుతోంది. టెస్టుల్లో 121 పాయింట్లతో, వన్డేల్లో 122 పాయింట్లతో తొలి ర్యాంకు సాధించగా, టెస్టుల్లో 115 పాయింట్లతో, వన్డేల్లో 117 పాయింట్లతో దక్షిణాఫ్రికా జట్టు రెండో స్థానంలో నిలిచింది. ఈ నేపథ్యంలో భారత విజయాలపై క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ నెటిజన్లకు ట్వీటర్ వేదికగా ఓ ప్రశ్న సంధించాడు.
'భారత క్రికెట్ జట్టు విజయాలకు, ఉన్నతదశకు చేరుకోవడానికి కారణాలేంటో చెప్పాలంటూ టీమిండియా క్రికెట్ ప్రేమికులను ప్రశ్నిస్తూ' ట్వీట్ చేశాడు ఇర్ఫాన్ పఠాన్. క్రికెట్ ప్రేమికులు నుంచి భారీ స్థాయిలో వచ్చిన సమాధానం మాత్రం ముగ్గురు క్రికెటర్లు. వారు వరుసగా మాజీ కెప్టెన్లు సౌరవ్ గంగూలీ, మహేంద్ర సింగ్ ధోని, ప్రస్తుత కెప్టెన్ విరాట్ కోహ్లి. ఈ ముగ్గురు కెప్టెన్లు ఎంతో నిజాయితీగా జట్టుకు సేవలు అందించడం వల్లే భారత క్రికెట్ నేడు అత్యున్నత దశకు చేరుకుందని బదులిస్తున్నారు. కొందరు నెటిజన్లు మాజీ కెప్టెన్ కపిల్ దేవ్, మాజీ కోచ్‌లు జాన్ రైట్, గ్యారీ కిర్‌స్టన్ కూడా భారత క్రికెట్ ఈ రోజు ఉన్నతదశలో ఉండేందుకు కారణమని అభిప్రాయపడ్డారు.
గంగూలీ నేతృత్వంలోని టీమ్ సచిన్, రాహుల్ ద్రవిడ్, వి.వి.ఎస్ లక్ష్మణ్, ఆ తర్వాతి తరంలో యువరాజ్ సింగ్, జహీర్ ఖాన్, హర్భజన్ సింగ్, ఇర్ఫాన్, మరికొందరు క్రికెటర్ల పోరాట పటిమే భారత క్రికెట్‌ను ఈ స్థాయికి తీసుకొచ్చిందని హుడా ఖాన్ అనే నెటిజన్ ట్వీట్ చేశాడు. మరోవైపు దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న టీమిండియా తొలి టీ20లో విజయం సాధించిన విషయం తెలిసిందే. నేడు ఇరుజట్ల మధ్య రెండో టీ20 జరగనుంది.
Question for all the lovers of Indian cricket. What is the reason behind the rise of Indian cricket?
— Irfan Pathan (@IrfanPathan) February 20, 2018
@SGanguly99 @msdhoni & @imVkohli
— Ankit (@AnkPurohit) 20 February 2018
John Wright ( Ex-coach) @Gary_Kirsten @anilkumble1074
Sourav Ganguly, MS Dhoni & Virat Kohli
— Harsh Tegta (@HTegta) 20 February 2018
To be very honest its the efforts of @SGanguly99 and the team including all senior players like sir rahul dravid, laxman sir, sachin sir and after that youngistan MSD, yuvi, zak, bajji, you and many more. Its true efforts of every player who contributed towards it.
— HUDA KHAN (@HUDA_KHAN03) 20 February 2018
Comments
Please login to add a commentAdd a comment