న్యూఢిల్లీ:తన ఆత్మకథ 'ఏ సెంచరీ ఈజ్ నాట్ ఎనఫ్' అనే పుస్తకంలో ఇప్పటికే పలు విషయాలను పునరావృతం చేసిన భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ.. మహేంద్ర సింగ్ ధోని గురించి మరికొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. 2003 వరల్డ్ కప్ జట్టులో ధోని ఉంటే బాగుండేదని గంగూలీ తాజాగా పుస్తకంలో పేర్కొన్నాడు. ఇంతకీ ధోని గురించి గంగూలీ ఆత్మకథలో ఏమన్నాడంటే..' నేను అప్పటికే చాలా కాలం నుంచి యువ ఆటగాళ్ల కోసం అన్వేషిస్తున్నా. ప‍్రధానంగా ఒత్తిడిని జయించి మ్యాచ్ స్థితిని మార్చేవాళ్ల కోసమే నా వేట ప్రారంభించా. అది సరిగ్గా 2003 వరల్డ్ కప్ సమయం. ఆ సమయంలో ధోని జట్టులో ఉంటే బాగుండేది. 2004లో ధోనిని గుర్తించాం. 2003 నాటికి ధోని గురించి ఆరా తీస్తే అప్పుడు రైల్వే కలెక్టర్‌గా ఉన్న విషయం తెలిసింది. అప్పుడు ఆశ్చర్యపోయా' అని గంగూలీ తెలిపాడు.
'జట్టులోకి వచ్చిన తొలి రోజు నుంచే ధోని ముద్ర కనిపించింది. ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ధోనిపై పెట్టుకున్న నమ్మకం నిజమైంది. నా అంచనా తప్పుకాలేదు' అని గంగూలీ పుస్తకంలో తెలిపాడు.
Comments
Please login to add a commentAdd a comment