
గంభీర్ ఇంట మహాలక్ష్మీ..
న్యూఢిల్లీ: భారత క్రికెటర్ గౌతమ్ గంభీర్ ఇంట మరో మహాలక్ష్మీ అడుగుపెట్టింది. గంభీర్-నటాష దంపతులకు మరో పండంటి పాప జన్మించిది. ఈ విషయాన్ని గంభీర్ సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. తన పెద్ద కూతురు ఆజీన్ తన చెల్లిని ఎత్తుకున్న ఫోటోకు క్యాప్షన్‌గా ‘మముల్ని దీవించేందుకు మా కుటుంబంలోకి మరో యువరాణి అడుగుపెట్టింది. ఆమె రాకతో మా జీవితంలో వెలుగులు నిండాయి. కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టిన యువరాణికి స్వాగతం’ అని గంభీర్ పేర్కొన్నాడు. అయితే కోహ్లీతో సహా పలువురు క్రికెటర్లు, అభిమానులు గంభీర్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
An angel blessing our family,
— Gautam Gambhir (@GautamGambhir) 21 June 2017
An angel brightening our lives,
Welcome to the world, little angel! ❤ pic.twitter.com/nrJ0hhuX9Y